సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ప్రతి విద్యార్థికి రూ. 20 లక్షలు
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేవంత్ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఓవర్సీస్ విద్యానిధి పథకంతో రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సర్కార్ చేయూత అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మహాత్మా జ్యోతి బాపులే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద లబ్ధిదారుల సంఖ్య 300 గా ఉంది. అయితే తాజాగా ఆ సంఖ్యను 700కు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రెట్టింపు లబ్ధి పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో లబ్ధిదారుల సంఖ్య 130 శాతం పెరిగింది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈ పథకం కింద బీసీ- సీ, బీసీ- ఈ కేటగిరీ విద్యార్థులను కలిపితే మొత్తం 1000 మంది పేద, మధ్య తరగతి బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇక అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో భాగంగా ఇదివరకు 210 మంది ఎస్సీలకు మాత్రమే అవకాశం ఉండేది. తాజాగా ఆ సంఖ్యను 500లకు పెంచారు. ఇక ఎస్టీల్లో లబ్ధిదారుల సంఖ్య గతంలో 100 మంది ఉండగా ఇప్పడు 200 మందికి చేరింది. ఇక ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే పథకం ఇది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. సంబంధిత విద్యార్థులు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వారి ఫ్యామిలీ సంవత్సర ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టులో ప్రతిభ కనబర్చాలి. అదే విధంగా జీఆర్ఈ, జీమ్యాట్ లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది.












Click it and Unblock the Notifications