రెవెన్యూ సిబ్బందిపై కేసీఆర్ గుస్సా..? టెన్షన్ ఎందుకు దండగా .. చిన్నజీయార్ ఉండగా !

తెలంగాణలో జరుగున్న పాలన మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు , మంత్రులు , అధికారులు పెద్దగా నిర్ణయాలు తీసుకోలేరు. అన్నింటికీ సీఎం కేసీఆరే ఫైనల్ లేదంటే కేటీఆర్ కాని ఇద్దరినీ కలిసే అవకాశం మాత్రం అందరికీ లభించదు. మరి రోజు రోజుకు సమస్యలేమో పెరిగిపోతున్నాయి. చెప్పుకోడానికి దిక్కులేదు. సామన్యులు చాలా రోజులుగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇటీవలి కాలంలో రెవెన్యూ శాఖను రద్దు చేస్తానంటూ సీఎం కేసీఆర్ నుంచి వస్తున్న ప్రకటనలు ఆ శాఖ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంత్రులు , ఎమ్మెల్యేలు , అధికారులు ఎవ్వరిని కలిసినీ ప్రయోజనం లేదు. వారు సైలెంట్‌గా ఉండలేదు.. తమ రెవెన్యూ తెలివి చూపించారు.

త్రిదండి చిన్నజీయార్ స్వామిని కలసిన వీఆర్ఓల సంఘం నేతలు

త్రిదండి చిన్నజీయార్ స్వామిని కలసిన వీఆర్ఓల సంఘం నేతలు

ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని పెద్దలు చెబుతుంటారు. రాష్ట్రంలో మరెవ్వరికీ రాని ఐడియా రెవెన్యూ ఉద్యోగుల్లో వీఆర్ఓల సంఘం నాయకులకు వచ్చింది. సీఎం అపాయింట్ ఇవ్వక పోవడంతో నేరుగా సీఎం కేసీఆర్‌కు ఆధ్యాత్మిక గురువైన చిన్నజీయార్ స్వామిని ఆశ్రయించారు. ఆయన ద్వారా కేసీఆర్ మీద వత్తిడి తేవాలన్నది వారి వ్యూహం. స్వామీజీతో చెప్పించుకోవడం ద్వారా తమ ఉద్యోగాలు పదిలం చేసుకోవాలన్నది వారి ఆలోచన.

చిన్నజియార్ ను ఏమని కోరారు.

చిన్నజియార్ ను ఏమని కోరారు.

శంషాబాద్‌లోని ఆశ్రమంలో చిన్నజీయార్ స్వామిని కలసిన విఆర్ఓల సంఘం నేతలు తమ గోడువినిపించుకున్నారు. రెవెన్యూ శాఖను రద్దు చేస్తానంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రకటనల వల్ల తమ కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని వారు స్వామీజీకి వివరించినట్లు వివరించారు. రెవెన్యూ శాఖలో మార్పులు చేస్తే పని చెయ్యడానికి తాము సిద్దంగా ఉన్నామని , లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఈ విషయాలు కనీసం తమతో చర్చించే నాథుడే లేకుండా పోయాడని వారు ఆవేధన వ్యక్తం చేశారు.

స్వామీజీని కలిసింది ఆశ్రమంలో కాని మీడియాతో మాట్లాడింది సచివాలయంలో.

స్వామీజీని కలిసింది ఆశ్రమంలో కాని మీడియాతో మాట్లాడింది సచివాలయంలో.

రాష్ట్రపరిపాలనా కేంద్రం సచివాలయం. కాని సీఎం కేసీఆర్ రావడంలేదు. ప్రగతి భవన్ నుంచే పాలన సాగిస్తున్నారు. దీంతో అధికారుల , మంత్రుల్లో కూడా సీరియస్‌నెస్ కనిపించడంలేదు. అయితే ఉద్యోగులు తమ సమస్యలు సచివాలయంలో ఉన్న మంత్రులకు , అధికాలకు చెప్పినా ప్రయోజనం ఉండదని చిన్నజీయార్ స్వామికి చెప్పుకున్నారు. అయితే మీడియాతో మాట్లాడడానికి మాత్రం సచివాలయానికే వచ్చారు. అక్కడికి వచ్చి మారీ తము చిన్నజీయార్ స్వామీజీని కలవడానికి గల కారణాలు వివరించారు.

అభయం ఇచ్చిన చిన్నజీయార్ ..?

అభయం ఇచ్చిన చిన్నజీయార్ ..?

రెవెన్యూ ఉద్యోగులకు చిన్నజీయార్ స్వామీ అభయం ఇచ్చారని వీఆర్ఓల సంఘం నేత గోల్కొండ సతీష్ ప్రకటించారు. తమకు ఎలాంటి ఇబ్బందులు రావని స్వామీజి ఆశిర్వధించినట్లు ఆయన వివరించారు. ఏది ఏమైనా సీఎం కలవడం లేదని ఇంట్లో కూర్చొకుండా ఆయన గురువునే కలసిన ఉద్యోగుల తీరుకు ప్రశంసలు లభిస్తున్నాయి. చిన్నజీయార్ ఆశిర్వాదం ఫలించి ఉద్యోగుల సమస్యలు తీరుతాయా లేదా చూడాలి మరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+