రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్: బాస్ ఈజ్ హియర్: వర్మ మార్ఫింగ్ ఫోటోలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన పడింది.రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు రాగానే ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డిని బాహుబలితో పోల్చారు. ఇప్పుడు ఖైదీ నెంబర్ ఫోటో పెట్టారు.

TRS అంచనాలు రివర్స్: ఎదురులేని రేవంత్

మావి ఏవి: నేతల అలక, పేర్లు చెప్పిన రేవంత్, టీడీపీలో మరో వికెట్ డౌన్

 రామ్ గోపాల్ వర్మ పోస్టర్లు

రామ్ గోపాల్ వర్మ పోస్టర్లు

రామ్ గోపాల్ వర్మ రెండు ఫోస్టర్లను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. వీటికి రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్ అని టైటిల్ పెట్టాడు. అంతేకాదు, బాస్ ఈజ్ హియర్ అని ట్యాగ్ లైన్ పెట్టాడు. ఈ పోస్టర్ల కోసం చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150వ సినిమాకు చెందిన పోస్టర్లను మార్ఫింగ్ చేసారు. చిరంజీవి తలకు బదులు రేవంత్ తలను ఉంచారు.

నిన్న ఇలా

నిన్న ఇలా

రెండు రోజుల ముందు 'రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి. బాహుబలి బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కి ఓట్ల వర్షం కురిపిస్తాడు.' అని వర్మ ఆ తర్వాత బాహుబలిగా రేవంత్ ఫోటోను పెట్టారు.

 నిన్న లోకేష్, నేడు రాహుల్ గాంధీ

నిన్న లోకేష్, నేడు రాహుల్ గాంధీ

రామ్ గోపాల్ వర్మ పోస్టులపై విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. నిన్నటి వరకు ఏపీలో లోకేష్‌తో ఇప్పుడు, జాతీయస్థాయిలో రాహుల్ గాంధీతో అంటూ రేవంత్ ఫోటోలను పెట్టారు.

హెచ్చరికలు కూడా

హెచ్చరికలు కూడా

అంతేకాదు, రామ్ గోపాల్ వర్మ ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం సరికాదని కూడా కొందరు కామెంట్స్ పెట్టారు. ఇలాంటి చీప్ పోస్టులు పెట్టకుంటే మిమ్మల్ని అన్ ఫాలో చేస్తామని కూడా హెచ్చరించిన వారు ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Director Ram Gopal Varma posts on Facebook on Congress leader and MLA Revanth Reddy.
Please Wait while comments are loading...