హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

#RIPHumanity:హ్యాష్‌ట్యాగ్‌తో ప్రియాంకకు సంఘీభావం, ఉరే సరి అని నెటిజన్ల ట్వీట్లు

|
Google Oneindia TeluguNews

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా నిరసనజ్వాల ఎగిసిపడుతోంది. నలుగురు నిందితులను కఠినంగా శిక్ష విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇటు సోషల్ మీడియా ట్విట్టర్‌లో కూడా ప్రియాంక హత్యపై సంఘీభావం తెలుపుతున్నారు. ట్విట్టర్‌లో #RIPHumanity హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీంతోపాటు #PriyankaReddyMurderCase, #RIPPriyankaReddy హ్యాష్‌ట్యాగ్స్ కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి.

చర్లపల్లి జైలుకు ప్రియాంక నిందితులు... వాహనంపై చెప్పులు.. రాళ్లు విసిరిన ప్రజలు...!! చర్లపల్లి జైలుకు ప్రియాంక నిందితులు... వాహనంపై చెప్పులు.. రాళ్లు విసిరిన ప్రజలు...!!

ఉరే సరి..

ఉరే సరి..

ప్రియాంక హత్యపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. నిందితులను తక్షణమే ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక మృతిపై పలువురు ప్రముఖులు కూడా సంఘీభావం తెలిపారు. మహ్మద్ అలియాస్ ఆరిఫ్, బొల్లు శివ, నవీన్, చెన్నకేశవులకు ఉరే సరి అని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో #RIPHumanity హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్లు చేస్తున్నారు.

ఒక్కరికైనా..

ఒక్కరికైనా..

నిర్భయ ఘటన నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క నిందితుడికి ఉరి శిక్ష విధించలేదని పేర్కొన్నారు. నిందితులందరికీ కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకరు లైంగికదాడి చేయాలంటే భయపడేలా బహిరంగంగా ఉరితీయాలని కోరుతున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

బందీగా చిక్కి

బందీగా చిక్కి

బుధవారం రాత్రి మానవృగాలకు బందీగా చిక్కిన ప్రియాంకకు.. వారు చుక్కలు చూపించారు. తమ వద్ద ఉన్న మద్యం కూడా తాగించారనే కఠోర నిజం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక అఘాయిత్యం చేశారని తెలుస్తోంది. అప్పుడు కూడా కేకలు పెట్టిన కీచకులు కరుణించలేదు. తమ వాంఛను తీర్చుకొని మట్టుబెట్టారు.

నిరసనల పర్వం

నిరసనల పర్వం

మరోవైపు శనివారం షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితులు పీఎస్‌లో ఉన్నారని తెలుసుకొని భారీగా స్థానికులు తరలొచ్చారు. వారు ఎక్కడ స్టేషన్‌లోపలికి వస్తారని భయపడి.. గేటుకు తాళం వేశారు. చివరికి టాస్క్‌ఫోర్స్ బలగాలు రంగంలోకి దిగడంతో వారిని జైలుకు తరలించారు. అంతకుముందు పీఎస్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. మేజిస్ట్రేట్ కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. 14 రోజులు రిమాండ్ విధించడతో జైలుకు తరలించారు.

English summary
netizens Solidarity to priyanka #RIPHumanity hashtag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X