బాధాకరం, కఠిన చట్టాలు రావాలి: అమృతకు కోమటిరెడ్డి పరామర్శ, కౌసల్య ఓదార్పు
Recommended Video

నల్గొండ: కులాంతర ప్రేమ వివాహం కారణంగా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కుంటుంబ భ్యులను శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడతూ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న భయానక ఘటనలపై కేసీఆర్ స్పందించిన తీరు సరికాదన్నారు.

అత్యంత బాధాకరం
ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ప్రాణాలు తీయడం అత్యంత బాధాకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అధికారంలోకి రాగానే..
ఎప్పుడూ ఫామ్‌హౌక్‌కే పరిమితమయ్యే కేసీఆర్.. సచివాలయానికి రాకున్నా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించాలని హితవు పలికారు. కొండగట్టు బస్పు ప్రమాదంలో 60 మంది చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ రాకపోవడం విస్మయం కలిగిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరువు హత్యలపై కఠిన చట్టాలు తెస్తామని వెల్లడించారు.

ప్రత్యేక చట్టం తేవాలి..
కులాంతర వివాహితుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సామాజికవేత్త, తమిళనాడులో హత్యకు గురైన శంకర్ భార్య కౌసల్య డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృత వర్షిణిని పరామర్శించిన ఆమె కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మీడియాతో మాట్లాడారు.

నేను చూస్తుండగానే నా భర్తను..
‘నేను ఒక దళిత యువకుడిని వివాహం చేసుకున్నందుకు కక్షగట్టిన నా తల్లిదండ్రులు, బంధువులు 2016 మార్చి 13న నా భర్త శంకర్‌ను నేను చూస్తుండగానే దారుణంగా హత్య చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన నా తలకు 36 కుట్లు పడ్డాయి. నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని పోరాటం చేశాను. అందుకు జిల్లా కోర్టు నా తండ్రితోపాటు మరో ఐదుగురికి మరణ శిక్ష, ఒకరికి యావజ్జీవ కారగార శిక్ష విధించింది' అని కౌసల్య వివరించారు. జిల్లా కోర్టు నా తండ్రికి రెండుసార్లు ఉరిశిక్ష వేయమని తీర్పునిచ్చిందని చెప్పారు. హైకోర్టుకు వెళ్లినా వారు శిక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారని చెప్పారు.

అమృతకు రక్షణ కల్పించాలి
నిందితులు 58 సార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా రాకుండా చేశానని కౌసల్య చెప్పారు. ప్రభుత్వం తనకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు ముగ్గురు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను తన తరపున వాదించేందుకు నియమించిందని చెప్పారు. తన భర్త పేరున శంకర్ సోషల్ జస్టిస్ ట్రస్టును ఏర్పాటు చేసి 30 మంది విద్యార్థులకు విద్యా సహాయం చేయడంతోపాటు వారికి డప్పులో శిక్షణ ఇస్తున్నానని, ప్రేమికులకు మద్దతు, రక్షణ కల్పించడంతోపాటు వారి వివాహానికి సహకారం అందిస్తున్నట్లు కౌసల్య చెప్పారు. ప్రణయ్ భార్య అమృతకు ఇక్కడి ప్రభుత్వ రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications