ఏపీలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి
చిత్తూరు జిల్లా రేణిగుంట-శ్రీకాళహస్తి మార్గంలోని వెదుళ్లచెరువు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట-శ్రీకాళహస్తి మార్గంలోని వెదుళ్లచెరువు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
రేణిగుంట పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెదుళ్లచెరువు వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది.

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అవగా, కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరి తీవ్రగాయాలు కాగా వారిని వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
మృతులను హైదరాబాద్ లోని జీడిమెట్లకు చెందిన కిషన్ రెడ్డి(36), ప్రేమ్ కుమార్ రెడ్డి(37)గా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటికి తీశారు.
ఈ ప్రమాదంలో రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. మృతదేహాలను కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications