వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
వరంగల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.
ఆటోను లారీ ఢీకొనటడంతో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్రగాయాలపాలైన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. లారీ వేగంగా వచ్చి బలంగా ఢీనడంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనా స్థాలానికి చేరుకుని క్షతగాత్రులకు సాయం చేసేందుకు ప్రయత్నించారు.

ఆ తర్వాత స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుల్లో ఆటో డ్రైవర్ తోపాటు రాజస్థాన్, బీహార్‌కు చెందిన కూలీలు ఉన్నారు. ఈ కూలీలు తేనె విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఆటో డ్రైవర్ భట్టు శ్రీనివాస్‌ది వరంగల్‌లోని శివనగర్. జాబోదు, నితీశ్, రూప్‌చంద్ రాజస్థాన్‌కు చెందినవారు కాగా, సురేశ్, మేరీ బీహార్ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమీర్.. రాజస్థాన్ వాసిగా గుర్తించారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వరంగల్ సీపీ రంగనాథ్ పరిశీలంచారు. ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications