గర్జిస్తున్న గులాబీ.!ఎరుపెక్కుతున్న కమలం.!నడ్డా రాకతో మరింత ఉత్కంఠ.!
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయం ఒక్కపారిగా వేడెక్కింది. బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్టుకు నిరసనగా చేపట్టిన మౌన ర్యాలీకి బీజేపి జాతీయ అద్యక్షుడు జేపి నడ్డా హైదరాబాద్ కు చేరుకోవడం, ర్యాలీకి అనుమతి లేదంటూ నడ్డాను అదుపులోకి తీసుకోవడం వంటి పరిణామాలతో రాజకీయంగా ఉత్కంఠ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో బీజేపి వర్సెస్ టీఆర్ఎస్ అనే విధంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేసుకుంటే తప్పేంముంది అని బీజేపి ప్రశ్నిస్తుండగా, కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తున్నారని పోలీసులు వాదిస్తున్నారు. ఇక్కడే ఈ రెండు పార్టీలు కయ్యానికి కాలు దువ్వుకుంటున్నాయి.

ఇది తెలంగాణ అడ్డా.. ఎలా వస్తావ్ నడ్డా.. సూటిగా ప్రశ్నిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ
ఏ బిడ్డా..ఇది తెలంగాణ అడ్డా.. ఎలా వస్తావ్ నడ్డా.. అంటోంది అదికార టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పద్నాలుగు రోజుల రిమాండ్ కు వ్యతిరేకంగా పద్నాలుగు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు తెలంగాణ బీజేపి పిలుపునిచ్చింది. అందులో భాగంగా సికిందరాబాద్ లోని మమాత్మా గాంధీ విగ్రహం నుండి ప్యారడైస్ హోటల్ వరకూ మౌన ప్రదర్శన నిర్వహించి తెలంగాణ ప్రభుత్వంపై నిరసన తెలపాలనుకుంది తెలంగాణ బీజేపి నాయకత్వం. ఈ కార్యక్రమానికి బీజేపి జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నడ్డాను ఆహ్వానించింది తెలంగాణ బీజేపి.

కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తున్నారు.. పోలీసుల ఘాటు ఆరోపణలు
కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆంక్షలు అమలులో ఉన్నాయని, సభలు, ర్యాలీలు, ప్రదర్శనలు, దీక్షలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు కావాలనే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెప్పుకొస్తున్నారు. జనజాగరణ కార్యక్రమానికి కూడా అనుమతి లేదని, ఐనప్పటికి వేల సంఖ్యలో బీజేపి కార్యకర్తలు గుమిగూడుతున్నారని, ఇలాంటి తప్పని పరిస్థితులో చర్యలు తీసుకున్నామని పోలీసులు వివరిస్తున్నారు.

బీజేపి వర్సెస్ టీఆర్ఎస్.. రాష్ట్రంలో యుద్ద వాతావరణం..
ఇదిలా ఉండగా తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో బీజేపి నేతలు భగ్గుమన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, బాబా సాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్నారని మండి పడుతున్నారు బీజేపి నేతలు. చంద్రశేఖర్ రావుకు సంబందించిన సమాచారం, పాలనా విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అన్ని అంశాల పట్ల కేంద్రానికి సమచారం వెళ్లిందని, సరైన సమయంలో చంద్రశేఖర్ రావుపైన కేంద్రం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బీజేపి నేతలు స్పష్టం చేస్తున్నారు.
Recommended Video

కేసీఆర్ అవినీతి చట్టా ఉంది.. సమయం వచ్చినప్పుడు విప్పుతామంటున్న బీజేపి నాయకులు
బండి సంజయ్ కుమార్ రిమాండ్ తో బీజేపి నేతలు ఒక్కటై అదికార పార్టీ మీద యుద్దం ప్రకటించారు. బండి సంజయ్ మీద అక్రమ కేసులు బనాయించారని బీజేపి ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీజేపి ఎదుగుతుందన్న ఈర్శ్యతో బీజేపిని అణగతొక్కేందుకు సీఎం చంద్రశేఖర్ రావు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం అన్ని అంశాలను గమనిస్తోందని, సమయం వచ్చినప్పుడు చంద్రశేఖర్ రావు అవినీతి చిట్టాను విప్పుతుందని స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రశేఖర్ రావుకు చుక్కలు చూపిస్తామంటున్నారు బీజేపి నేతలు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications