సిగ్నల్ కట్ చేసి.. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ, మహిళల గొలుసులు లాక్కెళ్లారు
హైదరాబాద్: బెంగళూరు నుంచి కాచిగూడ వస్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. రైలు మహబూబునగర్ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిచిన సమయంలో దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు.
ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో రైలు కిటికీల నుంచి నగదు, నగలు దోచుకెళ్లారు. ఐదుగురు ప్రయాణికుల నుంచి మొత్తం 25 తులాల నగలు, రూ.10 వేల నగదు దోపిడీ చేశారు. మహిళా ప్రయాణికుల మెడల్లోంచి బంగారు గొలుసులను తెంచుకుని పరారయ్యారు.

రైలు కాచిగూడ చేరుకున్న అనంతరం బాధితులు రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసినట్లు రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని బృందాలు దొంగల వేట ప్రారంభించాయని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సిగ్నల్స్ కట్ చేసిన అనంతరం దాదాపు 20 నిమిషాలపాటు రైలు దివిటిపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగింది. ఈ సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
-
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications