హైదరాబాద్‌కు రాబర్ట్ వాద్రా: రెండు రోజుల పర్యటన ఎందుకంటే?
కాంగ్రెస్ నేత, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వాద్రాను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో రెండు రోజులు పర్యటించేందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో వివిధ ప్రాంతాలను సందర్శించనున్నట్లు చెప్పారు.
తెలంగాణలోని ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటానని రాబర్ట్ వాద్రా తెలిపారు. వీలైనంత వరకు తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. తెలంగాణలోని ఆలయాలను, మసీదులను సందర్శిస్తానని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆయన జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని, బంజారాహిల్స్‌లోని మసీదును రాబర్ట్ వాద్రా సందర్శించనున్నారు.

కాగా, యూపీఏ హయాంలో రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని బీజేపీ సహా పలు రాజకీయ పార్టీల నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. డీఎల్ఎఫ్ భూ కుంభకోణం, బికనీర్ భూ కుంభకోణం, రూ. 9600 కోట్ల కర్ణాటక లోయకుంట ఇలా ఎన్నో కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా తెలంగాణలో పర్యటించడంలో రహస్యం ఏంటని ఇక్కడి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
రానున్న రోజల్లో తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్నారా? లేక మరేదైనా కారణాలున్నాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీకే పరిమితమైన ఆయన తెలంగాణలో పర్యటించడం ఇక్కడి రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications