నిమజ్జనం వేళ నగర వాసులకు కీలక సమాచారం..!!
గణేష్ నిమజ్జనంకు భాగ్యనగరం సిద్దమవుతోంది. నిమజ్జనోత్సవం వేళ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బందోబస్తుతో పాటుగా నిమజ్జన శోభా యాత్ర జరిగే ప్రతీ ప్రాంతంలోనూ నిఘా ఏర్పాటు చేసారు. అదే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. శోభా యాత్ర జరిగే రోడ్ మ్యాప్ ను అధికారులు విడుదల చేసారు.
బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం వద్ద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. కేశవగిరి - చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ - ఎడమ మలుపు - ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్ - ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ - అలియాబాద్ - నాగుల్చింత - చార్మినార్ - మదీనా - అఫ్జల్‌గున్ - ఆఫ్ ఎస్ఏ బజార్ - ఎంజే మార్కెట్ - అబిడ్స్ క్రాస్ రోడ్ - బషీర్ బాగ్ - లిబర్టీ జంక్షన్ - ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు అంబేద్కర్ విగ్రహం.

సికింద్రాబాద్ నుంచి ఊరేగింపు సంగీత్ థియేటర్ - ప్యాట్నీ - ప్యారడైజ్ జంక్షన్ -ఎండీ రోడ్ - రాణిగంజ్ - కర్బలా మైదాన్ - సోనాబాయి మసీదు - ట్యాంక్ బండ్ గుండా వెళుతుంది. ఎన్టీఆర్ మార్గ్ - పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) చేరుకుంటుంది. చిల్కలగూడ క్రాస్ రోడ్ల నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ హాస్పిటల్ - ఆర్టీసీ ఎక్స్ రోడ్ - నారాయణగూడ ఫ్లైఓవర్ - నారాయణగూడ వై జంక్షన్ - హిమాయత్ నగర్ మార్గంలో వెళ్లి లిబర్టీ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.
ఈస్ట్ జోన్, ఉప్పల్ ప్రాంతం నుంచి ఊరేగింపు రామంతపూర్ - శ్రీ రమణ జంక్షన్ - 6 నెం. జంక్షన్ - తిలక్ నగర్ - శివం రోడ్ - ఓయూ ఎన్‌సీసీ - విద్యా నగర్ టీ జంక్షన్ - హిందీ మహావిద్యాలయ క్రాస్ రోడ్ - ఫీవర్ హాస్పిటల్ - టీవై మండలి - బర్కత్‌పురా క్రాస్ రోడ్ల మీదుగా వెళుతుంది. వైఎంసీఏ, నారాయణగూడ క్రాస్ రోడ్ చేరుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే ఊరేగింపులో చేరుతుంది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే విగ్రహాలు ఐఎస్ సదన్ - సైదాబాద్ - చంచల్‌గూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ క్రాస్ రోడ్స్‌లో చేరతాయి. పెద్ద విగ్రహాలు మూసారాంబాగ్ మీదుగా అంబర్‌పేట్ వైపు వెళ్తాయి.

ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ డైవెర్షన్ ప్రధాన ఊరేగింపు మార్గల్లో విగ్రహాన్ని మోసుకెళ్లే వాహనాలు తప్ప మరే ఇతర వాహనాలు అనుమతి ఉండదు. 17వ తేదీ 10 గంటల నుంచి 18వ తేదీ వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయి. అవసరమైతే ఈ ట్రాఫిక్ ఆంక్షలు పొడిగిస్తాయి. ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌లలో 17వ తేదీ 6గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఆర్టీసీ బస్సుల రూట్‌పై ఆంక్షలు విధించారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications