కదులుతున్న రైలు ఎక్కబోయిన యువతిని కాపాడిన మహిళా కానిస్టేబుల్ (వీడియో)
హైదరాబాద్: రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు తొందర, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చాలా సందర్భాల్లోనూ రైల్వే పోలీసులు, రక్షణ దళాలు ఇలాంటి ప్రమాదాల నుంచి ప్రయాణికులను కాపాడుతున్నాయి. తాజాగా, బేగంపేట రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతి ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. అదే సమయంలో అక్కడున్న లేడీ కానిస్టేబుల్ ఆమెను కాపాడారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు లింగంపల్లి-ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ బేగంపేట్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అయితే ఆ ట్రైన్ కొద్దిసేపు ఆపి ముందుకు కదిలి వేగాన్ని పుంజుకుంటోంది. ఈ క్రమంలో సరస్వతి అనే ఓ ప్రయాణికురాలు ఆ కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సనిత అనే 'రైల్వే ప్రొటెక్క్షన్ ఫోర్స్' (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ ఆమెను గమనించింది.

వెంటనే పరిగెత్తుకెళ్లి ఆ ప్రయాణికురాలిని పట్టుకుని ఫ్లాట్‌ఫాంవైపునకు లాగి కాపాడింది. ఒకవేళ కానిస్టేబుల్ సనిత అక్కడికి రాకపోయుంటే ఆ ప్రయాణికురాలు ట్రైన్ కింద పడిపోయే ప్రమాదం ఉండేది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ రైల్వే శాఖ ఆ మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసలు కురిపించింది.
The safety of passengers is a top priority for the railways, and the duty staff at Begumpet station proved it yet again by saving a passenger's life who was trying to board a moving train. Hats off to their courage! #RailwaySafetyFirst #BraveHearts" pic.twitter.com/T9ESzui04d
— RPF Secunderabad DIV (@rpfscr_sc) May 31, 2023
గతంలో కూడా సనిత రైల్వే స్టేషన్లలో ఇలాంటి మంచి పనులు చేసిందని చెబుతున్నారు. ప్రయాణికుల సామాగ్రి కనబడకపోయిన లేదా అనుకోకుండా వదిలేసి వెళ్లిపోయిన వారికి వాటిని తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకునేదని అధికారులు వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన సనిత 2020లో ఆర్పీఫ్‌లో చేరిందని ఆ తర్వాత బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుందని తెలిపారు. తాజా ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఆమె చేసిన పనిని అభినందిస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications