బీసీ కులాలకు రూ. లక్ష సాయం చివరి తేదీపై మంత్రి గంగుల కీలక ప్రకటన
హైదరాబాద్: ప్రభుత్వం అందిస్తామన్న రూ. లక్ష సాయం కోసం అర్హత కలిగిన బీసీ కులాలకు చెందిన చాలా ప్రజలు.. మీసేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జూన్ 20 వరకు చివరితేదీ కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సర్టిఫికేట్లు కావడానికే నెల రోజుల వరకు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి బీసీలకు రూ. లక్ష సహాయం పథకం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం తపిస్తారని తెలిపారు. కులవృత్తుల్లోని చేతివృత్తులకు చేయూతనిచ్చి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. శనివారం వరకు 2,70,000 దరఖాస్తులు ఆన్‌లైన్లో నమోదయ్యాయని వెల్లడించారు.
మొదటగా అర్హతకలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదవారికి అందజేస్తామని మంత్రి గంగుల తెలిపారు. ప్రతి నెలా 5వ తేదీ లోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. ఇన్‌చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతీ నెల 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా సహాయాన్ని అందజేస్తామన్నారు. దరఖాస్తుదారులు కేవలం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి గంగుల సూచించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఫారాన్ని ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి గాని సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఎంపికైన లబ్ధిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామాగ్రిని కొనుక్కోవాలని సూచించారు . లబ్ధిదారుల అభివృద్ధి కోసం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. నెలలోపు లబ్ధిదారులతో కూడిన యూనిట్ల ఫోటోలను ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీసీ సహాయం పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications