రూ.1000 కోట్లు స్వాహా.. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో బడా మోసం..!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఏవీ టెక్నాలజీస్ పేరుతో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. గడ్డం వెంకట్రావు, గడ్డం వేణుగోపాల్ అనే వ్యక్తులు సుమారు రూ. 1000 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు సైబరాబాద్ ఎకనామిక్ అండ్ ఆన్‌లైన్ క్రైమ్స్ వింగ్ గుర్తించింది. ఈ మోసంలో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 4500 మంది అమాయక ప్రజలు తమ పెట్టుబడులను కోల్పోయినట్లు తెలిపింది.

ఏం జరిగిందంటే..

గడ్డం వెంకట్రావు, గడ్డం వేణుగోపాల్, కంపెనీ సీఈఓ శ్రేయ పాల్ కలిసి ఈ మోసానికి ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఏవీ టెక్నాలజీస్, ఐఐటీ టెక్నాలజీస్, ఏవీ రియాల్టీ వంటి వివిధ సంస్థల పేర్లను ఉపయోగించి ప్రజలను ఆకర్షించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని, తమ ద్వారా పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి నెలా 6 శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికారు.

rs-1000-crore-financial-fraud-by-av-technologies-at-hyderabad

గడ్డం వేణుగోపాల్ ప్రజల నుంచి సేకరించిన డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. అయితే, దాదాపు రూ. 400 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించకుండా ప్రజలను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ డబ్బును విదేశాలకు మళ్లించినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

ఈ భారీ మోసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా, ప్రధాన నిందితులైన గడ్డం వేణుగోపాల్, గడ్డం వెంకట్రావులతో పాటు సీఈఓ శ్రేయ పాల్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మోసం వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనతో తక్కువ సమయంలో అధిక లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి పెట్టుబడి అయినా, దానిపై పూర్తి అవగాహన, విశ్వసనీయత ఉన్న సంస్థల ద్వారా మాత్రమే చేయాలని సూచిస్తున్నారు.

ఇక ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. పెట్టుబడిదారుల రక్షణ కోసం ప్రత్యేక ఆర్థిక మోసాల టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్నట్లు సమాచారం. బాధితులకు చట్టపరమైన సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ ప్రారంభించే అవకాశమూ ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+