డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్: రూ.50కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. నగర శివారులోని టోల్ గేట్ వద్ద భారీ ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ. రూ.50కోట్లు(అంతర్జాతీయ మార్కెట్లో) విలువ చేసే మాండ్రాక్స్ డ్రగ్స్‌ను, వారు ప్రయాణించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని ఓ కంపెనీలో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. హైదరాబాద్ మీదుగా చెన్నైకి తరలించేందుకు నిందితులు ప్లాన్ వేశారని తెలిపారు.

Rs. 50 crores valuable drugs seized in Hyderabad

తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ ముఠాల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి 46కిలోల మాండ్రాక్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విచారిస్తున్నట్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rs. 50 crores valuable drugs seized in Hyderabad outskirts on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి