బీఆర్ఎస్‌కు రూ. 683 కోట్ల విరాళాలు: ఎవరెన్ని కోట్లు ఇచ్చారంటే?
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(BRS)కు అందిన విరాళాల వివరాలను ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. 2022-23 ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీకి మొత్తం రూ. 683 కోట్ల విరాళాలు అందాయి. ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా రూ. 529 కోట్లు, ఎలక్ట్రోరల్ ట్రస్ట్ ఫండ్ ద్వారా రూ. 90 కోట్ల విరాళాలు అందాయని ఆ పార్టీ పేర్కొంది.
విరాళాలు ఇచ్చిన వివరాలు:
మంత్రి గంగుల కమలాకర్ రూ. 10 కోట్లు
మంత్రి మల్లారెడ్డి రూ. 4 కోట్లు
గాయత్రీ గ్రానైట్స్ రూ. 10 కోట్లు
హన్స్ పవర్ కంపెనీ రూ. 10 కోట్లు
రాజపుష్ప ప్రాపర్టీస్ రూ. 10 కోట్లు.

ఇది ఇలావుండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి తీసుకురావాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు.
ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తూ.. బీఆర్ఎస్ చేసిన పథకాల గురించి చెబుతున్నారు. ఇతర పార్టీలకు అవకాశమిస్తే ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరవుతుందంటూ హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలకు స్పష్టం చేస్తున్నారు కేసీఆర్.
ఇక, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. రెండు పార్టీల జాతీయ నాయకులతోపాటు రాష్ట్ర నేతలు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30 ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications