టాలీవుడ్ ప్రముఖులతో RSS చీఫ్ భేటీ వెనుక, మారుతున్న లెక్కలు..!!
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్ పర్యటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుం టున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన పర్యటించారు. జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల వేళ మోహన్ భగవత్ పర్యటన కీలకంగా మారుతోంది. అయితే, ఈ సారి ప్రత్యేకంగా ప్రముఖ అధికారులు.. టాలీవుడ్ ముఖ్యులతోనూ ఆయన సమావేశం కావటం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ భేటీ వెనుక కారణాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పక్కా వ్యూహాత్మక ప్రణాళికల మేరకే ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో.. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన హైదరాబాద్ కేంద్రంగా పలువురు పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్లు.. టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. హైదరాబాద్‌లోని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నివాసంలో ఈ కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో అక్కినేని నాగార్జున, నాని, తేజ సజ్జా, రానా దగ్గుబాటి, వరుణ్ తేజ్ మరియు రామ్ పోతినేని వంటి అగ్ర హీరోలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్ మరియు సాహు గారపాటి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

కాగా, ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని సినీ పెద్దలు చెబుతున్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఈ సమావేశం వెనుక ఆసక్తి కర చర్చ జరుగుతోంది. కొంత కాలంగా బాలీవుడ్ తో పాటుగా పలు ప్రాంతీయ సినిమాల పైన వివాదాలు... చర్చలు జరుగుతున్నాయి.
జాతీయ భావం తనే అంశం పైన సినిమాలు కొత్త చర్చకు కారణం అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమాల్లో జాతీయ భావం పెంచేలా ఉండాలని ఆరెస్సెస్ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఇదే విధంగా మోహన్ భగవత్ మిథున్ చక్రవర్తితో పాటుగా పలువురు సినీ ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఈ భేటీ పైన రాజకీయంగా చర్చ జరిగింది.
ఇక.. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ సమావేశంలో టాలీవుడ్ కు చెందిన 44 మంది హాజరైనట్లు తెలుస్తోంది. గతంలో 'ది కాశ్మీర్ ఫైల్స్', 'ది కేరళ స్టోరీ','రజాకార్' వంటి చిత్రాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కాగా.. ఇప్పుడు టాలీవుడ్ పెద్దలతో జరిగిన భేటీ వేళ ఈ అంశాలు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే, ఈ భేటీ పైన టాలీవుడ్ నుంచి ఎవరూ స్పందించటానికి సుముఖంగా లేరు.
-
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలే..!! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
కొత్త బిజినెస్ షురూ చేసిన తెలుగు యాంకర్..! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్లో ఆనంద క్షణాలు












Click it and Unblock the Notifications