TS RTC: ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులు.. !
నిరుద్యోగులకు ఆర్టీసీ శుభవార్త చెప్పనుంది. ఆర్టీసీలో నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అకాశం ఉంది. అయితే డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకే రిక్రూట్ మెంట్ చేసుకోనుంది. జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల్లో ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్, కండక్టర్ డ్యూటీ ఒకరే చేసేలా ఉండేందుకు నియామకాలు చెపట్టనున్నారు. ఇప్పుడు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు మినహా మిగతా వాటికి డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నాన్ స్టాప్ సర్వీసుల్లో నిర్ధారిత పాయింట్ల వద్ద కండక్టర్లు బస్సు ఎక్కి టికెట్లు జారీ చేసి దిగిపోతున్నారు.
త్వరలో డ్రైవర్ జాబ్ లోకి వచ్చే వ్యక్తి కండక్టర్ డ్యూటీ చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇందుకు డ్రైవర్ కం కండక్టర్ పేరుతో పోస్టులు భర్తీ చేసే యోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందుకే రెండు పనులు ఒకరు చేసేలా చూస్తున్నారు. దీని వల్ల ఆర్టీసీ ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ టికెటేతర ఆదాయంపై కూడా దృష్టి సారించింది.

ఆర్టీసీ ఇప్పటికే కార్గో సేవలు అందిస్తోంది. అంతే కాకుండా ఖర్చులు తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా తక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా కండక్టర్ల నియమించుకుంటే డ్రైవర్లతో పాటు కండక్టర్లకు కూడా జీతం చెల్లించాలి. అదే డ్రైవర్ కమ్ కండక్టర్ తీసుకుంటే ఖర్చు సగానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
ఆర్టీసీలో ప్రస్తుతం 2 వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో కొత్త డ్రైవర్ల పోస్టులకు నోటిఫికేషన్ త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications