పార్టీ మార్పు: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ నేతలకే ఎందుకీ శీల పరీక్ష?

హైదరాబాద్: ఏపీలో వైసీపీ నేతలు, తెలంగాణలో టీడీపీ నేతలు ప్రతి రోజు శీలపరీక్ష చేసుకోవాల్సి వస్తుందా? తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా ఈ విషయంలో మినహాయింపు లేదా? ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి, తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌‌లోకి పార్టీ మారుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే ఈ పుకార్లకు కారణం ఎవరు? ఇది తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీడీపీ, టీఆర్ఎస్‌ల వ్యూహమా? లేక ఆయా పార్టీలకు చెందిన నేతల బలహీనతా? అనే విషయం అంతుబట్టడం లేదు. పార్టీ మారుతున్నారంటూ ఆరోపణలు రావడంతో వెంటనే ఆయా పార్టీలకు చెందిన నేతలు ఖండిస్తూనే ఉన్నారు.

అయితే ఆ ఖండనలకు ఎందుకు విలువ ఉండటం లేదని విషయాన్ని మనం గ్రహించాలి. తెలంగాణలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సీఎం కేసీఆర్ దెబ్బకు టీడీపీ నేతలు విలవిలలాడుతున్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా తయారైంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితి.

పార్టీ ఫిరాయింపులు టీడీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గతేడాది నుంచి ఈ తరహా ప్రచారం తెలంగాణ టీడీపీలో నెలకోసారైనా వినిపిస్తోంది. నేతలు తాము పార్టీ మారడం లేదని గొంతు చించుకొని అరిచి ఆ తర్వాత అరగంటలోనే కండువాలు మార్చేస్తున్నారు. దీంతో పార్టీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి.

ఎవరు కోవర్టులో ఎవరు నమ్మకస్తులో తేల్చుకోలేని అయోమయం. ఇటీవల పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఈ వార్తలను ఖండించారనుకోండి. అయితే ఆయన ఖండించినా ఏదో మూల సందేహం తొంగి చూస్తూనే ఉంది. గతంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వ్యవహరించిన తీరుతో ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా నమ్మలేని స్థితి ఉంది.

చంద్రబాబు సమక్షంలో అరగంట మాట్లాడిన ఆయన ఆ తర్వాత అరగంటకే పార్టీ ఫిరాయించారు. ఈ పరిణామం చంద్రబాబునే షాక్‌కు గురి చేసింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుతారంటూ మరో ప్రచారం మీడియాలో ఊపందుకుంది. దీనిపై వాళ్లు ఎంత గట్టిగా గొంతు చించుకున్నా పార్టీ క్యాడర్‌లో నమ్మకం కుదరడం లేదు.

ఇటీవల రేవంత్ కాంగ్రెస్ సమావేశాలకు పదే పదే హాజరవడం ఈ సందేహాలను మరింత పెంచుతోంది. ఆర్డీఎస్ దీక్ష, ఖమ్మం జిల్లా పాలేరు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి సుచరితారెడ్డి తరుపున ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు.

అయితే ఇదంతా తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికేనని సన్నిహితులతో ఆయన చెబుతున్నారు. అయితే రేవంత్‌కు దగ్గరగా ఉండే వారు ఆయన్ను అనుమానించడం లేదు. కానీ మీడియా, టీడీపీ శ్రేణుల్లో మాత్రం కాంగ్రెస్‌లో చేరతారనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని సండ్ర వెంకట వీరయ్య స్వయంగా చెప్పారు. అదే సమయంలో తాను పార్టీ మారబోనని కూడా చెప్పారు. టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు ఏదో ఒక దశలో ఫలిస్తాయేమోనన్న సందేహాలు కూడా టీడీపీ నేతల్లో కలుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఏపీలో మరిస్థితి మరోలా ఉంది. వైసీపీ నుంచి ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. త్వరలో మరో 30 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ టీడీపీ మంత్రులే వ్యాఖ్యానించడం విశేషం. తాజాగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి.

తాను వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్వయంగా ఆయనే స్పందించారు. ఆ వార్తలన్నీ అసత్యాలేనని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్‌కు అండగా ఉంటానని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తాను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ పార్టీ క్యాడర్‌కు నమ్మకం కుదరడం లేదు.

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసమే టీడీపీ భారీగా వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీడీపీ చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీ చేరుతున్నట్లు చెప్పడం హాస్యస్పదంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ నేతలకే ఎందుకీ శీల పరీక్ష?

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ నేతలకే ఎందుకీ శీల పరీక్ష?


పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఈ వార్తలను ఖండించారనుకోండి. అయితే ఆయన ఖండించినా ఏదో మూల సందేహం తొంగి చూస్తూనే ఉంది. గతంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వ్యవహరించిన తీరుతో ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా నమ్మలేని స్థితి ఉంది. చంద్రబాబు సమక్షంలో అరగంట మాట్లాడిన ఆయన ఆ తర్వాత అరగంటకే పార్టీ ఫిరాయించారు. ఈ పరిణామం చంద్రబాబునే షాక్‌కు గురి చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ నేతలకే ఎందుకీ శీల పరీక్ష?

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ నేతలకే ఎందుకీ శీల పరీక్ష?


టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుతారంటూ మరో ప్రచారం మీడియాలో ఊపందుకుంది. దీనిపై వాళ్లు ఎంత గట్టిగా గొంతు చించుకున్నా పార్టీ క్యాడర్‌లో నమ్మకం కుదరడం లేదు. ఇటీవల రేవంత్ కాంగ్రెస్ సమావేశాలకు పదే పదే హాజరవడం ఈ సందేహాలను మరింత పెంచుతోంది. ఆర్డీఎస్ దీక్ష, ఖమ్మం జిల్లా పాలేరు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి సుచరితారెడ్డి తరుపున ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు.

 తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ నేతలకే ఎందుకీ శీల పరీక్ష?

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ నేతలకే ఎందుకీ శీల పరీక్ష?


అయితే ఇదంతా తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికేనని సన్నిహితులతో ఆయన చెబుతున్నారు. అయితే రేవంత్‌కు దగ్గరగా ఉండే వారు ఆయన్ను అనుమానించడం లేదు. కానీ మీడియా, టీడీపీ శ్రేణుల్లో మాత్రం కాంగ్రెస్‌లో చేరతారనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని సండ్ర వెంకట వీరయ్య స్వయంగా చెప్పారు. అదే సమయంలో తాను పార్టీ మారబోనని కూడా చెప్పారు. టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు ఏదో ఒక దశలో ఫలిస్తాయేమోనన్న సందేహాలు కూడా టీడీపీ నేతల్లో కలుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ నేతలకే ఎందుకీ శీల పరీక్ష?

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ నేతలకే ఎందుకీ శీల పరీక్ష?


తాజాగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. తాను వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్వయంగా ఆయనే స్పందించారు. ఆ వార్తలన్నీ అసత్యాలేనని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్‌కు అండగా ఉంటానని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తాను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ పార్టీ క్యాడర్‌కు నమ్మకం కుదరడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+