బస్టాండులు కిటకిట: సొంతూళ్ళకు వెళ్తున్న ఓటర్లు!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాలు ముగిసి, ప్రస్తుతం సైలెంట్ పీరియడ్ కొనసాగుతుంది. మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, శాంతి భద్రతల పరిరక్షణ చేస్తూ పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు.

ఇక ఐదేళ్లకొకసారి ఎన్నికలలో భాగంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ వంటి నగరాలలోనూ, ఇతర ప్రాంతాలలోనూ ఉన్న ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. సొంత ఊర్ల నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, అక్కడ జీవనం సాగిస్తున్న చాలా మంది ఓటర్లు ఇప్పటికే సొంత గ్రామాలకు తిరిగి వచ్చేస్తున్నారు. సొంత ఊర్లకు చేరుకుంటున్నారు.

Rush in bus stands: Voters going to their hometowns!!

మరోవైపు ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోవాలని, వచ్చి ఓటు వేసి వెళ్లాలని అభ్యర్థులు కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక స్వీప్ ద్వారా ఓటు తప్పనిసరిగా వెయ్యాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చేసిన ప్రచారం సత్ఫలితాలను ఇస్తుందని ఓటు వేసేందుకు వస్తున్న వలస ఓటర్లను చూస్తే అర్ధం అవుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నగరాలలో ఉన్నవారు, ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు ఎన్నికల పోలింగ్ కోసం భారీగా బస్ స్టాండులకు చేరుకోవటంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఓటు వెయ్యటం కోసం గ్రామాలకు తరలివస్తున్న ఓటర్లతో గ్రామాలలో సందడి వాతావరణం చోటుచేసుకుంది.

పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు దినాలను ప్రకటించడంతో, ప్రైవేటు కార్యాలయాలలోని సిబ్బందికి సెలవులు ప్రకటించటంతో ఇక సెలవుల నేపధ్యంలో కూడా ఉత్సాహంగా ఊర్లకు చేరుకుంటున్నారు. కనీసం తమ ఊరిని సెలవుల్లో చూసి వచ్చినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో వలస ఓటర్లు ఇళ్లకు బయలుదేరారు.

నిన్న సాయంత్రం నుండి వలస ఓటర్లు కుటుంబ సమేతంగా ఊర్లకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్ బస్టాండ్ ప్రాంతాలలో రద్దీ పెరిగింది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలలో అన్ని చోట్ల బస్ స్టాండులలో రద్దీ కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+