వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rythu bandhu: సిరిసిల్ల జిల్లాకు మాత్రమే రైతు బంధు..!

|
Google Oneindia TeluguNews

రాజన్న సిరిసిల్ల రైతులకు రైతు బంధు డబ్బులు విడుదలయ్యాయి. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సర్కారు.. అంతకంటే ముందే రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసింది. దీంతో అన్నదాతలకు గురువారమే డబ్బులు వచ్చాయి.

లక్షా 26వేల మంది రైతులు

లక్షా 26వేల మంది రైతులు


ప్రభుత్వం సుమారు లక్షా 26వేల మంది రైతుల ఖాతాల్లో రూ.131కోట్లు జమ చేసింది. రాష్ట్రంలో ఉన్న మిగతా రైతులకు ఈనెల 28 రైతు బంధు నిధులు జమ చేయనున్నారు. మొదటగా ఎకరం నుంచి మొదలు పెట్టి ఆ తర్వాత ఎంత భూమి ఉంటే అంత వరకు ఇవ్వనున్నారు.

సెస్

సెస్

అయితే శనివారం సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటుహక్కు ఉన్నోళ్లలో ఎక్కువమంది రైతులే కావడంతో రైతుబంధు ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాగా సెస్ ఎన్నికల కోసం ఆయా పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మొత్తం 87,130 మంది సెస్ సభ్యులలో ఎక్కువగా రైతులే ఉన్నారు.

15 డైరెక్టర్ స్థానాలు

15 డైరెక్టర్ స్థానాలు

సెస్ మొత్తం 15 డైరెక్టర్ స్థానాలు ఉన్నాయి. వీటిని చెజేక్కించుకునేందుకు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే సిరిసిల్ల నుంచి కేటీఆర్ ప్రతినిధ్యం వహిస్తుండడంతో ఈ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

బీజేపీ

బీజేపీ

బీజేపీ గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, సిరిసిల్ల టౌన్ వన్, వేములవాడ రూరల్, వేములవాడ టౌన్ వన్, వేములవాడ టౌన్ టూ, సిరిసిసిల్ల టౌన్, చందుర్తి డివిజన్ లపై బీజేపీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా ప్రచారం గట్టిగానే చేస్తోంది.

English summary
Rythu Bandhu money was released to the farmers of Rajanna Sirisilla. It has already been announced that Rythu Bandhu will be distributed across the state from 28th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X