Rythu Bandhu: నేటి నుంచే రైతు బంధు.. రూ.2 లక్షల రుణ మాఫీ అప్పుడే..!
రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి సోమవారం డా. బి. ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు.
రైతులకు నేటినుంతే రైతుబంధు నిధులను వారి ఖాతాల్లో వేసే ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ హామీ ఇచ్చిన రైతు భరోసాపై కూడా చర్చించారు. రైతు భరోసాలో భాగంగా ఎకరాకు రూ. 15 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వానకాలం రూ.7,500, యాసంగి రూ.7,500 రైతుల ఖాతుల్లో జమ చేయనున్నారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయనున్నారు. అదే విధంగా రైతు కూలీలకు కూడా సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

రైతు భరోసా విధివిధానాలు రూపొందించడానికి సమయం పడుతుందని.. అందుకే పాత విధానంలో రైతు బంధు అన్నాదాతల ఖాతాల్లో జమ చేయాలన సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. పాత పద్ధతి అంటే ఎకరాకు రూ.5 వేలు జమ చేయనున్నారు. అటు రూ.2 లక్షల రుణ మాఫీపై కూడా చర్చించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకై తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
ప్రస్తుతం జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ప్రజావాణిగా పేరు మార్చారు.
ఈ ప్రజావాణి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటలలోపు జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications