కేసీఆర్ సూర్యాపేట పర్యటనలో అపశృతి: వృద్దురాలు మృతి..
సూర్యాపేట: సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన సందర్బంగా అపశృతి చోటు చేసుకుంది. అధికారుల అత్యుత్సాహమో.. భద్రత చర్యల్లో భాగంగా చేపట్టిన చర్యలో గానీ.. ఓ వృద్దురాలి ప్రాణం బలైపోయింది.
సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తున్న వృద్దురాలి కారును అడ్డుకున్నారు. దీంతో సరైన సమయంలో చికిత్స అందక వృద్దురాలు మృతి చెందింది.

కాగా, మంత్రి జగదీష్ రెడ్డి నివాసం పక్కనే ఉన్న గాయత్రి నర్సింగ్ హోంకు చికిత్స కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పరిస్థితి విషమంగా ఉందని, తమ వాహనం వెళ్లేందుకు అనుమతినివ్వాలని కోరినా.. పోలీసులు ససేమిరా అనడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా వృద్దురాలి తరుపువారు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications