అక్కడ గుర్తించారు: వీడిన సాయి ప్రజ్వల మిస్సింగ్ మిస్టరీ..
ఇంటి నుంచి అదృశ్యమైన ఆమె ఉప్పల్ సమీపంలోని పీర్జాదిగూడలోని హాస్టల్‌లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: ఇంటర్మీడియట్ నారాయణ విద్యార్థిని సాయి ప్రజ్వల మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఇంటి నుంచి అదృశ్యమైన ఆమె ఉప్పల్ సమీపంలోని పీర్జాదిగూడలోని హాస్టల్‌లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు.
నారాయణ విద్యా సంస్థలో పెరిగిన ఒత్తిడిని తట్టుకోలేకనే ఆమె ఇల్లు విడిచి వెళ్లినట్టు నిర్దారించారు. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం.

కాగా, సాయి ప్రజ్వల మిస్టరీ రెండు తెలుగు రాష్ట్రాల్లోను కార్పోరేట్ చదువులపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది. విద్యార్థులకు కనీసం కాలకృత్యాలు తీర్చుకునే సమయం కూడా లేకుండా వారిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. ర్యాంకుల పేరుతో వారిని నాలుగు గోడల నడుమ బంధించి కాలేజీ యాజమాన్యాలు అవలంభిస్తున్న తీరుపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications