చంపుతానంటూ కొడుకును బెదిరిస్తున్న ఆగంతకుడు: తల్లి ఏం చేసిందంటే

శ్రీరాంపూర్:అమెరికాలో చదువుకొనేందుకు వెళ్ళిన సాయివరుణ్ పై ఓ ఆగంతకుడు తుపాకీ పెట్టి కాల్చుతానని బెదిరించాడు. ఈ ఘటన జరుగుతున్న సమయంలోనే ఆయన తన తల్లితో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాడు.అయితే ఈ ఘటనను వీడియో కాల్ లో చూసిన తల్లి నిలువెల్లా కంపించిపోయింది.చివరకు తన కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలుసుకొని ఆ తల్లి ఊపిరి పీల్చుకొంది.

అమెరికాలో ఇటీవల కాలంలో ఇండియన్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. మీ దేశం వెళ్ళిపొండంటూ హెచ్చరిస్తున్నారు.ఈ తరహ ఘటనలు ఎక్కువ కావడంతో అమెరికాలో నివాసం ఉంటున్న ఇండియన్లు తీవ్రంగా భయాందోళనలు చెందుతున్నారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తరహ ఘటనలు ఎక్కువయ్యాయి. స్థానికేతరులు తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే తప్పుడు అభిప్రాయంతో దాడులకు దిగుతున్నారు.

జాతివివక్ష దాడులకు తోడు ఉద్యోగావకాశాలు అనే అంశాన్ని సాకుగా చూపి దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడులు రోజుకు రోజుకు తీవ్రమౌతున్నాయి.ఇండియన్లపై ఎక్కువగా ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.

కొడుకుకు తుపాకీ పెట్టి బెదిరించడం చూసి తల్లడిల్లిన తల్లి

కొడుకుకు తుపాకీ పెట్టి బెదిరించడం చూసి తల్లడిల్లిన తల్లి

మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీరాంపూర్ కు చెందిన సామినేని భాస్కర్ రావు, జయలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. సాయి కిరణ్ పెద్ద కొడుకు, సాయి వరుణ్ చిన్న కొడుకు. సాయి కిరణ్ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. చిన్న కొడుకు సాయి వరుణ్ ఎంఎస్ చదువుతున్నారు.వీరిద్దరూ మిస్సిటీలో ఉంటున్నారు.సాయి వరుణ్ తన స్నేహితుడికి చెందిన స్టోర్స్ కు తరచూ వెళ్తుంటాడు.అయితే స్నేహితుడి స్టోర్ నుండి కంప్యూటర్ సహయంతో తల్లికి వీడియో కాల్ చేశాడు సాయి వరుణ్. అయితే అదే సమయంలో ఓ దుండగుడు వచ్చి సాయి వరుణ్ కు తుపాకీ గురిపెట్టాడు. మీ దేశం వెళ్ళిపోవాలని బెదిరించాడు.వీడియోకాల్ మాట్లాడుతున్న సమయంలోనే ఇదంతా చూసిన తల్లి తల్లడిల్లిపోయింది.కొద్దిసేపట్లోనే వీడియో కాల్ కట్ అయింది.

ఆందోళనతో పెద్ద కొడుకు సమాచారమిచ్చిన తల్లిదండ్రులు

ఆందోళనతో పెద్ద కొడుకు సమాచారమిచ్చిన తల్లిదండ్రులు


ఏప్రిల్ 8వ, తేదిన కొడుకుతో ఫోన్ లో తొలుత తండ్రి మాట్లాడాడు. అయితే తనకు ఆపీసుకు సమయం కావడంతో ఆయన ఫోన్ ను భార్యకు ఇచ్చి ఆపీసుకు వెళ్ళాడు. కొడుకుతో తల్లి జయలక్ష్మి మాట్లాడుతున్న సమయంలోనే దుండగుడు బెదిరించడం, వీడియో కాల్ కట్ కావడం జరిగింది.అయితే ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన జయలక్ష్మి భయానికి గురైన భర్తకు ఫోన్ చేసింది ఈ విషయాన్ని వారు పెద్ద కొడుకు సాయి కిరణ్ కు ఫోన్ లో సమాచారం ఇచ్చారు.

16 నిమిషాల్లోనే తమ్ముడి వద్దకు చేరుకొన్న సాయి కిరణ్

16 నిమిషాల్లోనే తమ్ముడి వద్దకు చేరుకొన్న సాయి కిరణ్

తల్లిదండ్రుల నుండి సమాచారం అందుకొన్న సాయికిరణ్ 16 నిమిషాల్లోనే తమ్ముడు ఉన్న స్టోర్ వద్దకు చేరుకొన్నాడు.అయితే అప్పటికే నిందితుడు పారిపోయాడు. తమ్ముడు క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకొన్నాడు సాయికిరణ్ . వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాడు.

కారు రావడంతోనే దుండగుడు పారిపోయాడు

కారు రావడంతోనే దుండగుడు పారిపోయాడు

సాయి వరుణ్ ను బెదిరించి కౌంటర్ లో ఉన్న డబ్బులను తీసుకొన్న దుండగుడు నిన్ను చంపేస్తా అంటూ బెదిరించాడు.అయితే అదే సమయంలో ఆ స్టోర్ వద్దకు కారు వచ్చింది. కారు శబ్దం విన్న నిందితుడు పారిపోయాడు. కారు రాకపోతే సాయి వరుణ్ ను చంపేసేవాడేమోనని తల్లిదండ్రులు అనుమానించారు.అయితే దేవుడి దయవల్ల తన కొడుకు ఎలాంటి ఆపద సంబంవించలేదని వారు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+