తెలంగాణ వీఓఏలకు గుడ్‌న్యూస్: వేతనాలు పెంపు, ఎంతంటే?

హైద‌రాబాద్: గ్రామ సంఘాల స‌హాయ‌కుల(వీఓఏ)కు తెలంగాణ ప్ర‌భుత్వం రాఖీ పండుగ కానుక అందించింది. రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీఓఏ) వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం నిర్ణయం మేరకు వీరి వేతనాలు నెలకు రూ. 8,000కు పెరగనున్నాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకులకు (వీఓఏ) లబ్ధి చేకూరనుంది.

సీఎం నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తాయి. వేతన పెంపు ద్వారా ఏడాదికి రూ. 106 కోట్లు ప్రభుత్వ ఖజానా పై అదనపు భారం పడనుంది. అయినా ఖర్చుకు వెనకాడకుండా మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో వేతన పెంపు నిర్ణయం తీసుకున్నారు.

Salaries hike to ikp voas by telangana government

ఇతర విజ్ఞప్తులనూ అంగీకరించిన సీఎం:

తమ జీతాలు పెంచాలని, తమకు యూనిఫాం కోసం నిధులను అందించాలని, తమకు ప్రతి మూడునెల్లకోసారి అమలవుతున్న రెనివల్ విధానాన్ని సవిరిస్తూ దాన్ని ఏడాదికి పెంచాలని, విజ్జప్తులను తక్షణమే పరిష్కరిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. కాగా, తమకు జీవిత బీమా కూడా అమలు చేయాలనే మహిళా సంఘాల సహాయకుల విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు.

తాము యూనిఫాం డ్రెస్ విధానాన్ని అనుసరిస్తామని, అందుకోసం నిధులు విడుదల చేయాలని మహిళా సంఘాల సహాయకుల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ. 2 కోట్లు నిధులను అందించాలని సీఎం నిర్ణయించారు. మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి, ప్రతి మూడు నెల్లకోసారి చేసే రెనివల్ విధానాన్ని ఇకనుంచి ఏడాదికి చేసేలా సవరించాలని సీఎం నిర్ణయించారు.

వీఏఓలు తమకు జీవిత బీమా అందించాలని సీఎం కు చేసుకున్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం ఇందుకు సంబంధించిన విధి విధనాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సీఎం ఆదేశించారు.

కాగా, గతంలో తమను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ తీసుకున్న మానవీయ నిర్ణయంతోనే తమకు నేడు నెల జీతాలతో భరోసా దొరికిందని, తమను ఆదరిస్తూ ఆసరానందిస్తూ భరోసాగా నిలిచినందుకు సీఎంకు రుణపడి వుంటామని మంత్రులతో సమావేశమైన మహిళా సంఘాల సహాయకులు (వీఓఏ) ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈవో గౌతమ్ పొట్రు, పలువురు వీఏఓ మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Salaries hike to ikp voas by telangana government

వీఓఏల జీతాల పెంపు వివరాలు:

ఉమ్మడి రాష్ట్ర కాలంలో గ్రామాల్లో పొదుపు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు సహాయకులుగా పనిచేస్తూ, సంఘానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, తదితర సమాచారాన్ని నోట్ బుక్కుల్లో నమోదు చేసే విధులను స్వచ్ఛందంగా నిర్వహించేవారు. వీరి కృషిని కనీసం గుర్తించని నాటి ప్రభుత్వాలు వారి మానాన వారిని వదిలేసాయి. వారు సేవ చేస్తున్న మహిళా సంఘాలనుంచి మాత్రమే ''గ్రూపు లీడర్లు'' గా కేవలం నెలకు రెండు వేలు రూపాయలు గౌరవ వేతనం తప్ప వారికి మరో ఆసరా లేకుండే.

కాగా, పొదుపు సంఘాలలోని మహిళలను సంఘటితం చేస్తూ, వారిని చైతన్య పరుస్తూ సమన్వయ కర్తలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వీఓఏ ల కృషిని, స్వచ్ఛందంగా వీరు చేస్తున్న సేవలను స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు. తద్వారా సీఎం మానవీయ పాలనలో వీరికి కూడా ఎంతో కొంత గౌరవ వేతనం అందించాలని నిర్ణయం జరిగింది. దీంతో 2016 సంవత్సరం నుంచి వీరికి నెలకు మూడు వేల రూపాయలను గౌరవ వేతనంగా అందించడం జరిగుతూ వస్తున్నది.

అంతే కాకుండా అందరికీ ఇటీవలే పెంచిన పీఆర్సి ని వీరికి కూడా అమలు చేస్తూ మరోమారు తన మానవీయ కోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దాంతో వీరికి ప్రభుత్వం అందించే వేతనం రూ.3,900 కు చేరింది. దాంతో మహిళా సంఘాలనుంచి అందే రెండు వేలుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే రూ.3,900 మొత్తం కలిపితే వీరి వేతనం కేవలం రూ.5,900 మాత్రమే. ఈ పరిస్థితుల్లో వీరు క్షేత్రస్థాయిలో పడుతున్న కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ మరోసారి ఆదకుని ఆసరానందించేందుకు నిర్ణయించారు. వారి విజ్ఞప్తి మేరకు రాఖీ పండుగ కానుకగా వీరి జీతాలను పెంచాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+