38 మంది ఇంజినీర్ల జీతం కోత పెట్టిన జీహెచ్ఎంసీ కమిషనర్: ఎందుకంటే?

హైదరాబాద్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలాల విషయంలో ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నారు.

నాలా పనులను నిర్లక్ష్యం చేసిన 38 మంది ఇంజినీర్లకు చెందిన ఒకరోజు వేతనం కోత విధిస్తూ కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాదకర నాలాలను గుర్తించి.. రక్షణ చర్యలు చేపట్టాలని గతంలో కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే నాలాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్.

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేసినందుకు గానూ 38 మందిపై చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వివరించారు.అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. నాలాల వద్ద జాగ్రత్తలు తీసుకోని వారిపై.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

Salary cut for negligence: ghmc commissioner disciplinary action against 38 engineers

భవిష్యత్తులో అవకతవకలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. హైదరాబాద్ నగర ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు.

గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షం పడితే నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు ప్రమాదాలు జరిగే అవకాశాకాలు కూడా లేకపోలేదు. గతంలో కూడా నాలాల్లో పడి పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+