సమంత- నాగ చైతన్య విడాకులు : నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు : అఫీషియల్ అనౌన్స్ మెంట్..!!
కొద్ది కాలంగా ప్రచారం జరుగుతన్నదే నిజమైంది. టాలీవుడ్ లో ఒక యంగ్ కపుల విడిపోయింది. నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్నారు. తమ వైవాహిక బంధం ముగిసిందని..ఇక, తామిద్దరం స్నేహితులుగా నే ఉంటామంటూ నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2017 అక్టోబర్ 7 న వీరిద్దరి వివాహం జరిగింది. కొంత కాలంగా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. సమంత సోషల్ మీడియా ఖాతాల్లో అక్కినేని అనే పేరు తీసేసిన సమయం నుంచి ఏదో జరుగుతోందనే ప్రచారం సాగింది.
Recommended Video

సమంత షూటింగ్స్ పైనే అభ్యంతరమా
అయితే, సమంత చేస్తున్న కొన్ని షూటింగ్స్ ను మానేయాలని..అమల లాగా ఇంట్లోనే ఉండాలంటూ కుటుంబ సభ్యులు సూచించినట్లుగా సమాచారం. దానికి సమంత సుముఖంగా లేరు. దీంతో..ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఫలితంగా సమంత వేరుగా ఉంటోంది. తాజాగా నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా సక్సెస్ కు సంబంధించి హీరోయిన్ సాయి పల్లవికి అభినందనలు చెప్పిన సమంత తన భర్త నాగ చైతన్యకు మాత్రం చెప్పలేదు. ఇక, ఇప్పటి వరకు ఇద్దరి విడాకుల గురించి జరుగుతున్న ప్రచారం పైన ఇద్దరి నుంచి స్పష్టత రాలేదు.

కొంత కాలంగా ప్రచారం..స్తబ్దుత
ఈ దశలో కొద్ది రోజుల క్రితం తిరుమల వెళ్లిన సమంతను అక్కడ ఇదే అంశం పైన ప్రశ్నించగా..ఇక్కడ ఇటువంటి ప్రశ్నలు వేస్తారా అంటూ సీరియస్ అయ్యారు. ఇక, నాగ చైతన్య లవ్ స్టోరీ సక్సెస్ మూడ్ లో ఉండటంతో ప్యామిలీ మెంబర్స్ తో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలోనూ సమంత కనిపిచంచ లేదు. ఇక, ఈ నెల ఏడో తేదీన వారిద్దరి వివాహ వార్షికోత్సవం. ఈ సమయంలో నాగ చైతన్య తామిద్దరం విడిపోతున్నట్లుగా ట్వీట్ చేసారు. ఇక నుంచి తామిద్దరం ఫ్రెండ్స్ గా కొనసాగుతామని స్పష్టం చేసారు.

నాగ చైతన్య అధికారికంగా వెల్లడి
రెండు రోజుల క్రితమే హైదరాబాదే తన సొంత ఇల్లు అంటూ చెప్పుకొచ్చిన సమంత తన విడాకుల పైన జరిగిన ప్రచారానికి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అదే విధంగా నాగ చైతన్య సైతం పరోక్షంగా సమాధానం చెబుతూ తప్పించుకున్నారు. నాగార్జున వీరిద్దరి మధ్య గ్యాప్ భర్తీ చేయటానికి చేసిన ప్రయత్నాలు ఫలించ లేదని తెలుస్తోంది. పలు మార్లు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చిన వారి ఆలోచనల్లో మార్పు రాలేదు. ఇదే సమయంలో వారిద్దరి పైన విడాకులు ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో..నాగ చైతన్య ఈ రోజున అసలు విషయం బయట పెట్టాడు. అభిమానులంతా అర్దం చేసుకోవాలని కోరారు. తామిద్దరం పదేళ్ల పాటు స్నేహితులుగా ఉంటూ..ఒక్కటయ్యామని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications