వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధ్యాత్మిక వేడుక సమతా కుంభ్ 2023 నేటి నుండే.. షెడ్యూల్ ఇదే.. నేటి విశేషాలేంటంటే!!

సమతా మూర్తి కేంద్రంలో ఆధ్యాత్మిక వేడుక సమతా కుంభ్ 2023 నేటినుండే జరుగుతుంది. ఈ నెల 14 వరకు జరగనున్న ఈ వేడుకల షెడ్యూల్ ఇలా ఉంది. ఇక నేడు అంకురార్పణ తో విశేష పూజలు నిర్వహించనున్నారు.

|
Google Oneindia TeluguNews

గతేడాది సమానత్వ విగ్రహంగా పిలువబడే రామానుజాచార్య 216 అడుగుల భారీ విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో నేటి నుండి 14వ తేదీ వరకు సమతా కుంభ్ 2023 బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో సువర్ణమూర్తి భగవద్ రామానుజ స్వామికి ఉత్సవ ఆరంభ స్నపనంతో వేడుకలను మొదలుపెట్టనున్నారు.

నేటి నుండే సమతా కుంభ్ 2023.. తొలిరోజు అంకురార్పణ

నేటి నుండే సమతా కుంభ్ 2023.. తొలిరోజు అంకురార్పణ

216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణ చేసి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి ఆశ్రమంలో సమతా కుంభ్ 2023 బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలి రోజు కార్యక్రమాలలో భాగంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విశ్వక్సేన వీధి శోధన, మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు తీర్థ ప్రసాద గోష్టి నిర్వహింస్తున్నారు. ఆపై సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల 45 నిమిషాల వరకు సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించబడుతుంది. ఆపై ఆరు గంటల నుండి ఎనిమిది గంటల 30 నిమిషాల వరకు వేదికపై అంకురార్పణ వైనతేయ ప్రతిష్ట, ఆపై తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించబడుతుంది.

సమతా కుంభ్ లో ప్రతీరోజు పూజలు ఇలా

సమతా కుంభ్ లో ప్రతీరోజు పూజలు ఇలా

ఇదిలా ఉంటే సమతా కుంభ్ 2023 పేరుతో నిర్వహించనున్న ఆధ్యాత్మిక పండుగలో వివిధ కార్యక్రమాలను చేయనున్నారు. నేడు అంకరార్పణతో కార్యక్రమాలు మొదలై స్వామివారి రథోత్సవం, చక్రస్నానంతో ఫిబ్రవరి 14వ తేదీ వరకు పూర్తవుతాయి. తొలి రోజైన ఫిబ్రవరి రెండవ తేదీన విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 3వ తేదీన స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన సమతామూర్తికి కృతజ్ఞతాంజలి కీర్తన, రామానుజ నూత్తాందిది సామూహిక పారాయణం నిర్వహించనున్నారు.

రోజువారీ కార్యక్రమాలు ఇలా...

రోజువారీ కార్యక్రమాలు ఇలా...

ఫిబ్రవరి 5వ తేదీన రామానుజాచార్యుల విగ్రహానికి 108 రూపాలలో శాంతి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించి, ఫిబ్రవరి 6వ తేదీన వసంతోత్సవాన్ని, అదే రోజు సాయంత్రం 18 గరుడ సేవలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం డోలోత్సవాన్ని, హనుమంతుడి వాహన సేవను, 18 గరుడ సేవలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన కల్హరోత్సవాన్ని, సామూహిక పుష్పార్చనలను నిర్వహించి, సాయంత్రం 18 రూపాలలో తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 9వ తేదీన రామానుజులవారికి వరివస్య, సాయంత్రం అశ్వవాహన సేవను 18 గరుడ సేవలను నిర్వహించనున్నారు.

14 వ తేదీతో వేడుకలు పూర్తి.. భారీగా రానున్న భక్తులు

14 వ తేదీతో వేడుకలు పూర్తి.. భారీగా రానున్న భక్తులు

పదవ తేదీన ఉదయం సామూహిక ఉపనయనాలు, సాయంత్రం గజ వాహన సేవను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన రథోత్సవాన్ని చక్రస్నాన్ని మధ్యాహ్నం విశ్వశాంతి విరాట్ గీతా పారాయణాన్ని నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన ఉత్సవం, అంత్యస్నపనం, సాయంత్రం మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణలను నిర్వహించనున్నారు. మొత్తంగా ఈ వేడుకలు 14వ తేదీతో పూర్తి కానున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నారు. సమతా మూర్తి శ్రీ రామానుజ స్వామి స్పూర్తిని అందరికీ తెలియజేసేలా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఆ ఆధ్యాత్మిక పండుగలో పాల్గొనటానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విశేషంగా తరలి రానున్నారు.

వరంగల్ కమీషనరేట్ పోలీస్ .. ఆపరేషన్ జంజీర్!!వరంగల్ కమీషనరేట్ పోలీస్ .. ఆపరేషన్ జంజీర్!!

English summary
The spiritual ceremony Samatha Kumbh 2023 will be held from today itself at Samatha Murthy Kendra. The schedule of these celebrations which will be held till 14th of this month is as follows. Today special pujas will be performed with ankurarpana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X