వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు చెప్తాం.. సస్సెండ్ చేయిస్తాం.. వైసీపీ ఎమ్మెల్యే ఫ్యామిలీ: ఓకే చెప్పి రిమాండ్‌కు పంపారు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడి సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ వర్సెస్ పోలీసుల మధ్య వార్ కొనసాగుతోంది. తనను అరెస్ట్ చేసిన పోలీసులపై ప్రసాద్ గుర్రు మీదున్నారు. సీఎం కేసీఆర్‌కు చెప్పి సీఐ రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయిస్తానని ప్రసాద్ హెచ్చరించారు. అంతేకాదు ప్రసాద్‌ను మాదాపూర్ పోలీసు స్టేషన్ తీసుకెళ్లాక అతని కుటుంబసభ్యులు వచ్చి వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి బయటకొచ్చింది.

వీడియోలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సతీమణి విమాలా భాను, అతని కుమార్తె, అల్లుడు కూడా ఉన్నారు. ఆ సమయంలో తాము కూడా అక్కడే ఉన్నామని కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. మహిళలను నెట్టడం సరికాదాని .. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొస్తానని బెదిరించారు. తమతో అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

samineni prasad warning to police.. cops send him remand

మరోవైపు ప్రసాద్ కూడా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తనను అరెస్ట్ చేసిన రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయిస్తానని బెదిరించాడు. కానీ ప్రసాద్ మాటలను పోలీసులు లెక్కచేయలేదు. తమ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించారు. రాంగ్ రూట్ లో వెళ్లడమే గాక సీఐ, కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు సంబంధింత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్‌కు ఇవ్వడంతో జైలుకు తరలించారు. ఎమ్మెల్యే కుమారుడి తాటాకు బెదిరింపులకు పోలీసులు బెదరలేదు. సీఎంతో చెప్తానన్న ఓకే అని చెప్పి .. రిమాండ్‌కు పంపించారు.

English summary
The battle between Jaggayapet MLA's son Venkata Krishna Prasad against police is ongoing. Prasad is serious on police who arrested him. జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడి సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ వర్సెస్ పోలీసుల మధ్య వార్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్‌కు చెప్పి సీఐ రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయిస్తానని ప్రసాద్ హెచ్చరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X