అక్కా అంటూనే, పెళ్ళి చేసుకోవాలని వేధింపులు, ఎస్ఐ పై దాడికి యత్నం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫోన్ హ్యకింగ్ చేసి ఓ వివాహిత భర్తతో కలిసి ఏకాంతంగా దిగిన ఫోటోలను ఓ ప్రబుద్దుడు సంపాదించాడు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలను పెడుతూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఆ కుటుంబానికి తెలిసిన వాడే. బాధితురాలిని అక్కా అంటూ పిలిచిన నిందితుడే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయల్‌పై వచ్చిన నిందితుడు మళ్ళీ బెదిరింపులకు దిగాడు. నిందితుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకొనేందుకు వచ్చిన ఎస్ఐ‌పై కూడ నిందితుడు దాడికి యత్నించాడు. ఈ ఘటనపై ఎస్ఐ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

టెక్నాలజీ పెరిగిన తర్వాత దాన్ని మంచి కంటే చెడుకు ఎక్కువగా ఉపయోగించే వారే కన్పిస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురికి ఉపయోగపడే సమాచారం కంటే అశ్లీల దృశ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

తమ కుటుంబంలో వ్యక్తిగా నమ్మిన ఓ యువకుడు వివాహిత వ్యక్తిగత ఫోటోలను సేకరించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇలా చేయడం సరైంది కాదని కుటుంబ సభ్యులు చెప్పినా వినలేదు.

భర్తను వదిలేసి పెళ్ళి చేసుకోవాలని డిమాండ్

భర్తను వదిలేసి పెళ్ళి చేసుకోవాలని డిమాండ్

మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు పరిచయమయ్యాడు. సందీప్, బాధితురాలి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు. తమ కుటుంబంలో వ్యక్తిగా సందీప్‌ను చూసేవారు. సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించేందుకు బాధితురాలికి సహయం చేశాడు. అయితే వివాహితపై వక్రదృష్టితో ఆమె ఫోన్‌ను హ్యక్ చేసిన నిందితుడు భర్తతో దిగిన ఫోటోలను సంపాదించి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.భర్తను వదిలేసి తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేశాడు

అక్కా అంటూనే అనైతిక కార్యక్రమాలు

అక్కా అంటూనే అనైతిక కార్యక్రమాలు

బాధిత యువతి కుటుంబంతో ఏర్పడిన పరిచయంతో తొలినాళ్ళలో బాధిత వివాహితను సందీప్ అక్కా అని పిలిచేవాడు. సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించాడు. వెబ్ డెస్క్ టాప్ ద్వారా బాధితురాలి కదలికలపై నిఘా పెట్టాడు. బాధితురాలి ఫోన్‌ను హ్యక్ చేశాడు. భర్తతో కలిసి ఏకాంతంగా దిగిన ఫోటోలను ఆమె సామాజిక మాధ్యమాల నుండి సంపాదించాడు. బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

 ఇల్లుమార్చినా వదల్లేదు

ఇల్లుమార్చినా వదల్లేదు


సందీప్ తన వక్రబుద్దిని మార్చుకోలేదు. ఈ బాధను భరించలేక బాధిత కుటుంబం కొడంగల్ నుండి మీర్‌పేటకు మకాం మార్చింది. అయినా నిందితుడు వదల్లేదు.బాధితురాలి భర్తకు, స్నేహితురాళ్ల వాట్సప్‌ నంబర్లకు ఆయా చిత్రాల్ని పంపించడమే పనిగా పెట్టుకున్నాడు.భర్తను వదిలిపెట్టి తనతో వచ్చేయాలనే డిమాండ్‌తో వేధింపుల్ని అధికం చేశాడు. బాధితురాలి గురించి ఆమె సంబంధీకులకు దుష్ప్రచారం మరింత ముమ్మరం చేశాడు.

కాళ్ళు మొక్కినా కనికరించలేదు

కాళ్ళు మొక్కినా కనికరించలేదు

తన కూతురిపై వేధింపులు మానుకోవాలని బాధితురాలి తండ్రి కాళ్లు మొక్కినా కనికరించలేదు. అతడి వేధింపులు అరికట్టకపోతే ఆత్మహత్యే శరణ్యమని బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో కొడంగల్‌ సమీపంలోని ఓ ఠాణాలో కేసు నమోదు అయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై వచ్చినా నిందితుడి వైఖరిలో మార్పు రాలేదు. బెదిరింపులను కొనసాగించాడు.

ఎస్ఐపై దాడికి యత్నం

ఎస్ఐపై దాడికి యత్నం

ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సందీప్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన ఎస్సైని సందీప్‌ తీవ్రంగా ప్రతిఘటించాడు. జీపును కదలనీయకుండా ముందు పడుకోవడంతో రాళ్లు, కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఎస్సై ఫిర్యాదుతో సందీప్‌పై దాడి కేసు నమోదైంది. మరోవైపు అతడి వేధింపులపై మీర్‌పేట ఠాణాతోపాటు రాచకొండ సైబర్‌క్రైమ్‌ ఠాణాలోనూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే ఎస్సైపై దాడి కేసులో సందీప్‌ మహబూబ్‌నగర్‌ జైల్లో ఉండటంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు పీటీ వారెంట్‌పై సందీప్‌ను శుక్రవారం నగరానికి తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sandeep arrested for sexual harassment in Hyderabad on Saturday. Sandeep sexual harassed a woman in kondagal village. victim complained against him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి