గతంలో కూడా.. పోలీసుల నోటీసుకు సంధ్య థియేటర్ యాజమాన్యం రిప్లై ఇదే
పుష్ప-2 (Pushpa-2) ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ యాజమాన్యం స్పందించింది.
సంధ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులకు థియేటర్ యాజమాన్యం సంధానం పంపింది. మరికొన్ని కొన్ని వివరాలను కూడా జత చేసింది. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షోకు 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపింది. డిసెంబర్ 4,5 తేదీల్లో థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుందని వెల్లడించింది.

ఇక, సినిమాల విడుదలకు గతంలోనూ హీరోలు థియేటర్‌కు వచ్చారని సంధ్య థియేటర్ యాజమాన్యం తెలిపింది. థియేటర్‌లో కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్ ఉందని పేర్కొంది. ఈ మేరకు 6 పేజీల లేఖను సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపింది.
కాగా, డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడు ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ రూ. కోటి, దర్శకుడు సుకుమారు రూ. 50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ రూ. 50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెడ్డి రూ. 25 లక్షలు అందించారు.
కాగా, తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సంధ్య ధియేటర్ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్‌ను కూడా అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల చేశారు.












Click it and Unblock the Notifications