శ్రీతేజ్ హెల్త్‌పై గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు

స్టార్ హీరో అల్లు అర్జున్ 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే మహిళ మరణించారు. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చేశారు.

అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్‌ తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. అటు శ్రీతేజ్‌ ఆరోగ్యం సైతం క్రిటికల్‌గానే ఉందని వైద్యులు తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిందని, కోలుకోవడం కష్టమే అని వైద్యులు తెలపడం జరిగింది. తాజాగా శ్రీతేజ్‌ ఆరోగ్యానికి సంబందించి ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు ఆక్సిజన్, వెంటిలేటర్ సహాయాన్ని పూర్తిగా తొలగించినట్లు ప్రకటించారు.

Sandhya Theatre Sritej Health Bulletin Release

శ్రీతేజ్ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకుంటోంది. జ్వరం తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. ఇది శరీర రోగనిరోధక శక్తి మెరుగుపడుతున్న సంకేతంగా భావించవచ్చని వైద్యులు ప్రకటించారు. అతనికి ప్రస్తుతం పైపు ద్వారా ఆహారం అందిస్తున్నారు.. ఇది శరీరానికి అవసరమైన పోషకాలు అందించడానికి ఉపయోగపడుతోంది. శ్రీతేజ్ గాయం తీవ్రత దృష్ట్యా మొదట పరిస్థితి ఆందోళనకరంగా కనిపించినప్పటికీ.. చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. వ్యాధినిరోధక వ్యవస్థలో మార్పులు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు సంధ్య థియేటర్‌ ఘటనలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విరాళాలు సేకరించి ఆ కుటుంబానికి అందించాలని భావిస్తున్నారు. బాలుడు శ్రీతేజ్ కోసం సభ్యులు ముందుకురావాలని తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్ పిలుపునిచ్చింది. శ్రీ తేజ్ ను పుష్ప 2 నిర్మాత నవీన్ తో కలిసి సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పుష్ప 2 నిర్మాత 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి..ఆమె కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+