హైదరాబాద్ చేరుకున్న శరత్ మృతదేహం: ఫ్యామిలీకి అప్పగింత
Recommended Video

Oneindia Telugu News Update వన్ ఇండియా తెలుగు న్యూస్ అప్డేట్
హైదరాబాద్: అమెరికాలో దోపిడీ దొంగల కాల్పులో మృతి చెందిన కొప్పు శరత్ మృతదేహం బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తరలించి శరత్ కుటుంబానికి అతని మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు.

గురువారం శరత్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత శుక్రవారం అమెరికా కేన్సాస్‌లో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో శరత్ మృతి చెందాడు. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్.. ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలో అమెరికాకు వెళ్లాడు.
శరత్ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చడంలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సహాయసహకారాలు అందించారు. ఘటన జరిగిన నాటి నుంచి బండారు దత్తాత్రేయకు ఫోన్ ద్వారా ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.












Click it and Unblock the Notifications