హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాసరి నారాయణ రావు రెండో కుమారుడు అరుణ్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు...

|
Google Oneindia TeluguNews

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్ కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించారన్న ఆరోపణలతో
బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే... బొల్లారంలోని మారుతినగర్‌కు చెందిన బ్యాగరి నర్సింహులు (41) అనే వ్యక్తి పాత సినిమాల రిస్టోరేషన్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. దాసరి బతికి ఉన్న సమయంలో ఆయన వద్ద 2012 నుంచి 2016 వరకూ పనిచేశాడు. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో సినిమాల రిస్టోరేషన్‌ పనులు చూసేవాడు. దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన కుమారులు నర్సింహులుతో పాత ఒప్పందం రద్దు చేసి,కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు జూబ్లీహిల్స్‌లోని దాసరి ఇంట్లో నర్సింహులు సినిమాల రీస్టోరేషన్ పనులు పూర్తి చేశాడు.

 sc st atrocity case filed against late director dasari narayana raos son arun kumar

అయితే ఆ పనులు పూర్తి అయ్యాక డబ్బుల విషయంలో నర్సింహులుకు, దాసరి నారాయణరావు కొడుకులు ప్రభు, అరుణ్ కుమార్‌ల మధ్య గొడవలు జరిగాయి. అప్పటినుంచి నర్సింహులు తనకు రావాల్సిన డబ్బుల కోసం అరుణ్‌ని అడుగుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 13 తేదీన నర్సింహులును ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ వద్దకు రావాలని అరుణ్ చెప్పాడు. దీంతో నర్సింహులు తన స్నేహితులు శ్రీనివాస్‌, చంటితో కలిసి అక్కడకు వెళ్లాడు. అక్కడ దాసరి అరుణ్ కుమార్ తనను కులం పేరుతో దూషించాడని నర్సింహులు ఆరోపిస్తున్నాడు. ఈ నెల 16న అరుణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మరోవైపు ఈ కేసుపై దాసరి అరుణ్ కుమార్ స్పందించారు.అతనెవరో తనకు తెలియదని పోలీసులకు చెప్పానని అరుణ్ పేర్కొన్నారు. పోలీసులు దీనిపై ఎంక్వైరీ చేస్తామని చెప్పారన్నారు. ఒకవేళ బంజారాహిల్స్‌లో కేసు నమోదైతే అక్కడ ఎఫ్‌ఐఆర్‌ ఉంటుంది కదా అని ప్రశ్నించారు. అతను దాసరి నారాయణరావు దగ్గర ఎప్పుడు పని చేసాడో కూడా తెలియదన్నారు. తెలియని వ్యక్తికి ఎలా డబ్బులు ఇవ్వాలో తనకు అర్థం కావట్లేదన్నారు. ఇదంతా తనకు ఫ్రీ పబ్లిసిటీగా ఉపయోగపడుతుందన్నారు.

గత నెలలో దాసరి కుమారులపై అట్లూరి సోమశేఖర్ రావు అనే వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అప్పు తీర్చమన్నందుకు చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.దాసరి నారాయణరావు ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పలు దఫాలుగా తన నుంచి రూ.2.10 కోట్లు అప్పుగా తీసుకున్నారని చెప్పారు.దాసరి మరణానంతరం పెద్దల సమక్షంలో ఆయన కుమారులు దాసరి ప్రభు, అరుణ్ 2018 నవంబరు 13వ తేదీన రూ.2.10 కోట్ల బదులు రూ. 1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారని తెలిపారు. అయితే ఆ డబ్బు కూడా ఇవ్వట్లేదని ఆయన ఆరోపించారు.ఈ మేరకు పోలీసులు వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దాసరి మరణానంతరం ఆయన తనయులు తరుచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. ఇప్పటికీ ప్రభు,అరుణ్ కుమార్‌ల మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి. దాసరి కుటుంబానికి సన్నిహితుడైన మోహన్ బాబు మధ్యవర్తిగా వ్యవహరించి ఆస్తి వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసినా.. ఇంతవరకు దాసరి ఆస్తుల లెక్క తేలలేదు. మొన్నామ‌ధ్య ఓ సారి దాస‌రి పెద్ద కోడ‌లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ ఆస్తి కాజేశారని మోహ‌న్ బాబుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

English summary
SC, ST atrocity case registered against Dasari Arun Kumar, second son of late director Dasari Narayana Rao. Banjara Hills police have registered case against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X