శబరిమలకు ప్రత్యేక రైళ్లు - షెడ్యూల్, రిజర్వేషన్ ప్రారంభం..!!

శబరిమలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తున్నారు. మకర జ్యోతి దర్శనం జరిగే సంక్రాంతి వరకు రైళ్లన్నీ ఇప్పటికే రిజర్వ్ అయ్యాయి. దీంతో, తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 18 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. డిసెంబరు 6 నుంచి జనవరి 1 వరకు అందుబాటులో ఉంచింది. నేటి నుంచి ఈ రైళ్లకు రిజర్వేషన్లు మొదలయ్యాయి. ఈ రైళ్ల షెడ్యూల్ ను రైల్వే అధికారులు ప్రకటించారు.

శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా 18 రైళ్లను ప్రకటించింది. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తుండ‌గా.. మరిన్ని ప్రత్యేక రైళ్లను జోడిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో వేర్వేరు చోట్ల నుంచి శబరిమలకు మొత్తం 26 అదనపు రైలు సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైళ్లకు నేటి నుంచి రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌(మౌలాలి) నుంచి కొల్లాంకు డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో, మచిలీపట్నం నుంచి కొల్లాంకు డిసెంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

SCR announces 18 special trains for Sabarimala from December 6th to January 1st bookings begin

అదే విధంగా తిరుగు ప్రయాణంలో కొల్లాం నుంచి మౌలాలికి డిసెంబరు 8, 15, 22, 29 తేదీల్లో, కొల్లాం నుంచి మచిలీపట్నంకు డిసెంబరు 4, 11, 18, 25, జనవరి ఒకటవ తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్-కొల్లాం మధ్య 12 ప్రత్యేక రైళ్లు నడప‌నున్న‌ట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. మౌలాలి-కొల్లాం మధ్య రైలు నెం.07143 నవంబర్ 22, 29... డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్ర‌త్యేక సర్వీసులు ఖరారు చేసారు. ‌ కొల్లాం - మౌలాలి మధ్య రైలు నెం. 07144 నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో మొత్తం 12 సర్వీసులను ప్రకటించారు.

మచిలీపట్నం-కొల్లం మద్య (07145) ప్రత్యేక రైలు ఈ నెల 25, డిసెంబర్ 2, 9, 16 తేదీల్లో నడ‌పుతున్నారు. కొల్లాం- మచిలీపట్నం రైలు నెం. 07146 నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18 తేదీల్లో మొత్తం 10 సర్వీసులను షెడ్యూల్ చేసారు. అదే విధంగా మచిలీపట్నం-కొల్లం రైలు నెం.07147 డిసెంబర్ 23, 30 తేదీల్లో నడ‌వనుంది. ఇక, కొల్లాం- మచిలీపట్నం రైలు నెం. 07148 డిసెంబర్ 25, జ‌న‌వ‌రి 1వ తేదీన మొత్తం నాలుగు స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. డిమాండ్ కు అనుగుణంగా డిసెంబర్ ద్వితీయార్ధంలో మరిన్ని ప్రత్యేక రైళ్ల పైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+