తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి స్పెషల్ రైళ్ల ప్రకటన-రేపటి నుంచే బుకింగ్స్..!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే ఇవాళ భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగల సందర్భంగా హైదరాబాద్ నుంచి వికారాబాద్ తో పాటు ఏపీలోని కాకినాడ, నరసాపురం, ఇతర స్టేషన్లకు ప్రయాణించేందుకు వీలుగా ఈ రైళ్లను ప్రకటించారు. ఈ రైళ్లు ఏయే తేదీల్లో, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తాయన్న వివరాలతో కూడిన షెడ్యూల్ అధికారులు విడుదల చేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్స్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కాకినాడ-వికారాబాద్, కాకినాడ-సికింద్రాబాద్, తిరుపతి-వికారాబాద్, కాకినాడ-లింగంపల్లి-వికారాబాద్, వికారాబాద్-నరసాపూర్, నరసాపూర్-సికింద్రాబాద్, నరసాపూర్-లింగంపల్లి, వికారాబాద్-లింగంపల్లి నుంచి నరసాపూర్ ఇలా పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించేలా షెడ్యూల్ చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏయే తేదీల్లో ఏయే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తాయో తెలుసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ ట్వీట్ లో పూర్తి వివరాలు ప్రకటించింది.

South Central Railway Advisory
— SCRAILWAYUSERS (@scrailwayusers) December 13, 2025
for #Sankranti Special Trains pic.twitter.com/fLaubRZiNC
అలాగే ఈ సంక్రాంతి ప్రత్యేక రైళ్లు వారాంతపు రోజులతో పాటు వారం మధ్యలోనూ పలు రోజుల్లో ఆయా స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించబోతున్నాయి. జనవరి 8వ తేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకలు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే ప్రకటించిన స్టేషన్ల మధ్య రెండువైపులా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. కాబట్టి ప్రయాణికులు ఈ షెడ్యూల్ ఆధారంగా రేపటి నుంచి అడ్వాన్స్ టికెట్స్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వీటితో పాటు త్వరలోనే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications