మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైభవంగా రెండోరోజు చండీయాగం: గులాబీ వస్త్రాల్లో సీఎం దంపతులు, ప్రముఖుల హాజరు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మెదక్: ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో లోక కళ్యాణం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తలపెట్టిన అయుత మహా చండీయాగం రెండో రోజైన గురువారం కన్నులపండువగా సాగింది. కేసీఆర్ దంపతులు, రిత్విజులు గులాబీ రంగు వస్ర్తాలు ధరించి ఈ యాగంలో పాల్గొన్నారు.

పలువురు మహిళలు అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. శృంగేరి రిత్విజులు పలు రకాల యాగాలు, జపాలు, మంగళహారతులు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ను శృంగేరి భావి పీఠాధిపతి విధుశేఖర భారతి ఆశీర్వదించారు.

ఈ యాగానికి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్‌రావు, డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీలు కవిత, కేశవరావు, జితేందర్‌రెడ్డి, సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక వేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌తో కలిసి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ యాగంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులను కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ గొప్ప కార్యాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు పోటెత్తారు.

కాగా, డిసెంబర్ 27 వరకు ఈ యాగం కొనసాగనుంది. పెద్ద ఎత్తున భక్తులు వస్తోన్న దృష్ట్యా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. యాగానికి విచ్చేస్తోన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రసాదం, అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

చండీయాగం

చండీయాగం

లోక కల్యాణార్థం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అయుత చండీయాగం అత్యద్భుతంగా సాగుతోంది.

చండీయాగం

చండీయాగం

తొలిరోజు పసుపు దుస్తులతో కళకళలాడిన యాగస్థలి గురువారం రెండోరోజు గులాబీవర్ణ శోభితమైంది.

చండీయాగం

చండీయాగం

రోజుకో కొత్తరంగు, కొత్తబట్ట కట్టాలన్న నియమం మేరకు గురువారం కేసీఆర్‌ సహా రుత్వికులంతా గులాబీరంగు పట్టువస్త్రాలు ధరించి వచ్చారు.

చండీయాగం

చండీయాగం

ఉదయం 8.30గంటలకే పురాణం మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మహాన్యాసపూర్వక మహారుద్రం ఆరంభించారు. 9.30నిమిషాలకు కేసీఆర్‌ దంపతులు పూర్ణకుంభస్వాగతంతో యాగస్థలిలోకి అడుగుపెట్టాక గురుపూజ జరిగింది.

చండీయాగం

చండీయాగం

చండీమాత విగ్రహం ముందు.. శృంగేరీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఆచార్యులు నరహరి సుబ్రమణ్యభట్‌ ఆధ్వర్యంలో ప్రధాన రుత్వికులు గోపీకృష్ణశర్మ, ఫణిశశాంకశర్మ, హరినాథశర్మలు గురుపూజ నిర్వహించారు.

చండీయాగం

చండీయాగం

కేసీఆర్‌ సహా అంతా సాష్టాంగ ప్రణామం చేశారు. అనంతరం ద్విసహస్రచండీ పారాయణం ఆరంభమైంది.

చండీయాగం

చండీయాగం

రుత్వికులు హృద్యంగా పారాయణం చేస్తుంటే కేసీఆర్‌ యాగస్థలిలో కలియదిరుగుతూ నలుదిక్కులా ఉన్న చతుర్వేద హోమగుండాలతో పాటు రాజశ్యామల హోమానికి ప్రదక్షిణ చేశారు.

చండీయాగం

చండీయాగం

తొలిరోజు సుమారు 50 వేల మందిరాగా రెండోరోజుకల్లా అనూహ్యంగా రెట్టింపైనా నిర్వహణలో ఇబ్బందుల్లేకుండా చూడటంవిశేషం.

చండీయాగం

చండీయాగం

50వేల మంది దాకా ఆటంకాలు లేకుండా నడిచి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసి భోజనశాలకు వెళ్ళి తృప్తిగా ఆరగించగలిగారు.

చండీయాగం

చండీయాగం

మధ్యాహ్నంకల్లా భారీస్థాయిలో జనాలు రావటంతో వరుస కదలటం కాస్త ఆలస్యమైంది. సాయంత్రం ఆరుదాకా భక్తుల తాకిడి కనిపించింది.

చండీయాగం

చండీయాగం

అంతమందికీ తృప్తిగా భోజనం పెట్టి, ప్రసాదాలిచ్చి పంపించారు. పాకయాజీలు అలుపెరగకుండా పనిచేశారు.

చండీయాగం

చండీయాగం

కుంకుమ పూజలకు భారీ స్పందన చండీపారాయణం సమయంలోనే పక్కనే ఉన్న మంటపంలో కుంకుమార్చనలకు కూడా గురువారం భారీస్పందన లభించింది.

చండీయాగం

చండీయాగం

ఉదయం ఏడుగంటల నుంచే మహిళలు క్యూలో నిల్చోవటంతో నిర్వాహకులకు కాస్త కష్టమైంది. కేసీఆర్‌ కుమార్తె కవిత, కోడలు వచ్చిన మహిళలకు అమ్మవారి ప్రసాదంగా చీరలు పంచిపెట్టారు.

చండీయాగం

చండీయాగం

గురువారం 30లక్షల నవారణ పూజ, చతుష్షష్టి యోగినీ బలి, మహాగణపతి పూజ, మహాధన్వంతరీ యాగం, రాజశ్యామల, మహాసౌరము, చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, ఉక్తదేవతా జపాలు జరిగాయి.

చండీయాగం

చండీయాగం

సాయంత్రం పూజల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. తొలుత రుత్వికులకు అభివాదం చేసిన సీఎం తర్వాత శివపార్వతుల విగ్రహాల దగ్గర రుద్రక్రమార్చనలో పాల్గొన్నారు.

చండీయాగం

చండీయాగం

ధార్మిక ప్రవచనంలో భాగంగా యాగమహిమ, దత్త జయంతి విశేషాలను పురాణం మహేశ్వరశర్మ వివరించారు.

చండీయాగం

చండీయాగం

హారతి ముగిశాక చండీ విగ్రహం వద్ద కార్యక్రమం జరిగింది. లలితా నామావళి, కోటి నవాక్షరీ పురశ్చరణ, విశేషపూజ ఆశ్లేషాబలి, అష్టవధరసేవ జరిగాయి.

చండీయాగం

చండీయాగం

అనంతరం శ్రీరామలీలా హరికథా కాలక్షేపం నిర్వహించారు.

చండీయాగం

చండీయాగం

సాయంత్రం కార్యక్రమాల్లో స్పీకర్‌ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు సీతారాం నాయక్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఏపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, సుబ్బారావు(ప్రత్తిపాడు), ఎన్టీవీ ఛైర్మన్‌ నరేంద్రచౌదరి తదితరులు పాల్గొన్నారు.

చండీయాగం

చండీయాగం

గురువారం 30లక్షల నవారణ పూజ, చతుష్షష్టి యోగినీ బలి, మహాగణపతి పూజ, మహాధన్వంతరీ యాగం, రాజశ్యామల, మహాసౌరము, చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, ఉక్తదేవతా జపాలు జరిగాయి.

English summary
Ayutha Maha Chandi Yagam continued on Thursday in Erravalli in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X