మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్.. నేడు కేంద్ర జలసంఘం సందర్శన!!

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగటం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ప్రస్తుతం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడం స్థానికంగా ప్రజలలో ఆందోళన కలిగిస్తుంది. దీంతో భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించారు అధికారులు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర జల సంఘం సభ్యులు నేడు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సందర్శించనున్నారు. 20వ పిల్లర్ కుంగిపోవటంతో బ్యారేజీ గేటు విరిగింది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ వంతెన కుంగటం వెనుక 20, 21 పిల్లర్ వద్ద ఏదైనా బాంబు పేలి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

 Section 144 at Medigadda Barrage.. Central Water Board visit today!!

సంఘవిద్రోహ శక్తులు ఎవరైనా ఏదైనా ఘాతుకానికి పాల్పడ్డారేమోనన్న అనుమానంతో లక్ష్మీ బ్యారేజీ వద్ద 144 సెక్షన్ విధించి బాంబు స్క్వాడ్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. బ్యారేజీ వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ, పిల్లర్లు కుంగడానికి గల కారణాన్ని అధికారులు అన్వేషిస్తున్నారు.

ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజ్ వద్ద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు పిల్లర్లు కూలిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు వెల్లడించారు. ప్రస్తుతం గేట్ల నుండి శబ్దాలు వస్తున్నాయని పేర్కొన్న ఆయన, 40 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.100 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.

ఇక మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎందుకు కుంగింది అన్న దానిపైన విచారణ జరపడానికి కేంద్ర జల సంఘం సభ్యులు ప్రాజెక్టును సందర్శించనున్నారు. అసలు ఇంతకీ ఎందుకు పిల్లర్లు కుంగాయి. నిజంగానే ఇది సంఘవిద్రోహ చర్యనా లేక ప్రాజెక్టు నిర్మాణ లోపామా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు టార్గెట్ చేసేలా ఇటువంటి పరిణామం ఎదురు కావడం అధికార బి ఆర్ ఎస్ కు తలనొప్పిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+