వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం ఓ కుట్ర: వారికి జీవితఖైదు పడే ఛాన్స్; ప్రభుత్వోద్యోగాలు రానట్టే!!

|
Google Oneindia TeluguNews

అగ్నిపథ్ పథకంపై చెలరేగిన ఆందోళనలలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం నేపథ్యంలో విధ్వంసానికి పాల్పడిన 46 మందిని అన్ని ఆధారాలతో అరెస్ట్ చేసినట్టు రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. అంతేకాదు రైల్వేస్టేషన్లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. రైల్వే కేసులలో శిక్ష పడ్డ వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావని స్పష్టం చేశారు.

కొందరు రెచ్చగొట్టటం వల్లే రైల్వే స్టేషన్ లో విధ్వంసం

కొందరు రెచ్చగొట్టటం వల్లే రైల్వే స్టేషన్ లో విధ్వంసం

దాదాపు 2000 మంది ఆందోళనకారులు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారని, విధ్వంసం చేయడానికి వారిని కొందరు రెచ్చగొట్టారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. జూన్ 17 వ తేదీన జరిగిన విధ్వంసకాండకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించిన రైల్వే ఎస్పీ ఆరోజు ఉదయం ఎనిమిది గంటలకు రైల్వే స్టేషన్ మూడో గేట్ నుంచి 300 మంది దాకా వచ్చారని, వాళ్ల చేతుల్లో కర్రలు, రాడ్లు ఉన్నట్టు, మరికొందరు చేతులలో పెట్రోల్ బాటిల్స్ ఉన్నట్టు సిసి టివి ఫుటేజ్ లో స్పష్టంగా ఉందని తెలిపారు. ఇక ఆ తర్వాత తొమ్మిదిన్నరకల్లా మొత్తం 2000 మంది రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు అని ఆమె పేర్కొన్నారు.

దాడికి పాల్పడిన వారంతా తెలంగాణా వారే

రైల్వే స్టేషన్ పై దాడికి పాల్పడిన వారంతా తెలంగాణ వారేనని స్పష్టం చేశారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీసీ కెమెరాలు, స్టాల్స్, డిస్ప్లే బోర్డులను ధ్వంసం చేయడం ప్రారంభించారని, ఆ సమయంలో రైల్వే ప్లాట్ ఫామ్ ల మీద ఉన్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, దానాపూర్ ఎక్స్ ప్రెస్, అజంతా ఎక్స్ ప్రెస్ ల బోగీలకు నిప్పు అంటించారని తెలిపారు. మొత్తం నాలుగు బోగీలకు ఆందోళనకారులు నిప్పంటించారు అని, 58 అద్దాలు పగలగొట్టారు అని పేర్కొన్నారు.

ఆర్పీఎఫ్ బలగాలు కాల్పులు జరిపింది అందుకే .. వివరణ ఇచ్చిన రైల్వే ఎస్పీ

ఆర్పీఎఫ్ బలగాలు కాల్పులు జరిపింది అందుకే .. వివరణ ఇచ్చిన రైల్వే ఎస్పీ


ఆందోళనకారుల చర్యతో రైళ్లల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారని ఎస్పీ అనురాధ వివరించారు. ఆందోళనకారులను అడ్డుకోవడం కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జి ఆర్ పి పోలీస్ బృందాలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారు రాళ్లతో దాడి చేశారని, పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులను నియంత్రించే క్రమంలో ఆర్పిఎఫ్ బలగాలు కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ఆందోళనకారులు స్టేషన్లో లోకో ఇంజన్లకు నిప్పు పెట్టడానికి ప్రయత్నించారని, ఆ సమయంలో ఇంజన్లలో నాలుగు వేల లీటర్ల ఇంధనం, మూడు వేల లీటర్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉన్నాయని రైల్వే ఎస్పీ తెలిపారు. ఒకవేళ వాటికి నిప్పు పెడితే ఊహించని విషాదం జరిగి ఉండేదని, అందుకే ఆర్పీఎఫ్ బలగాలు కాల్పులు జరపాల్సి వచ్చిందని స్పష్టత ఇచ్చారు.

46 మంది అరెస్ట్ .. వారంతా చంచల్ గూడా జైల్లో, వాట్సప్ గ్రూపుల ద్వారా కుట్ర

46 మంది అరెస్ట్ .. వారంతా చంచల్ గూడా జైల్లో, వాట్సప్ గ్రూపుల ద్వారా కుట్ర


మొత్తం 20 రౌండ్ల కాల్పులు జరపగా, ఒకటి మాత్రమే ఎస్ఎల్ఆర్ తుపాకీ నుంచి ప్రయోగించారని, మిగతావన్నీ పెల్లెట్ లేనని ఎస్పీ తెలిపారు. అంతేకాదు ఈ ఘటనలో అరెస్టు చేసిన 46 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని వెల్లడించారు. వారిని కోర్టు ముందు హాజరు పరచి చంచల్గూడ జైలుకు తరలించామని తెలిపారు. విధ్వంసకాండ వెనుక ఆర్మీ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని, వారిని కూడా అరెస్టు చేస్తామని అనురాధ తెలిపారు.

విధ్వంసం కుట్రలో ఉన్న వాట్సప్ గ్రూపులు ఇవే

విధ్వంసం కుట్రలో ఉన్న వాట్సప్ గ్రూపులు ఇవే


ఆందోళనకారులు పలు వాట్సప్ గ్రూపుల ద్వారా ఈ కుట్రపన్నారని పేర్కొన్నారు. వాట్సప్ గ్రూపుల ద్వారా కుట్ర పన్నిన వ్యవహారంలో రైల్వే స్టేషన్ బ్లాక్ గ్రూప్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూప్, చలో సికింద్రాబాద్ ఏ ఆర్ వో త్రీ గ్రూప్, ఆర్మీ జీడి 20 21 మార్చ్ ర్యాలీ, సీఈఈ సోల్జర్స్ గ్రూప్, సోల్జర్స్ టు డై గ్రూప్ లను గుర్తించామని ఎస్పీ అనురాధ తెలిపారు. దాడి సమయంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, స్టేషన్ లోకి వచ్చిన పదిహేను వందల మందిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నామని వివరించారు.

 పక్కా ప్లాన్ తో జరిగిన విధ్వంసం

పక్కా ప్లాన్ తో జరిగిన విధ్వంసం

ఇది పక్కా ప్లాన్ తో జరిగిన విధ్వంసం అని, బీహార్లో రైళ్లను తగలబెట్టిన విధంగానే, ఇక్కడ కూడా విధ్వంసం సృష్టించాలని గ్రూపు లలో చాటింగ్ లో ఉందని ఎస్పీ అనురాధ తెలిపారు. అంతేకాదు సోమవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైల్వేస్టేషన్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. రైల్వే ఆస్తులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

English summary
Railway SP Anuradha said the destruction at the Secunderabad railway station was a conspiracy. She said the protesters who committed the vandalism had a chance of getting life imprisonment. It was made clear that those convicted would not get government jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X