Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీతక్క ప్రజా ప్రస్థానం: మాజీ నక్సలైట్ నుంచి రాష్ట్ర మంత్రిగా, ఎన్టీఆర్ పిలుపుతో

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టారు ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ సీతక్క అలియాస్ సీతక్క. మాజీ నక్సలైట్ నుంచి రాష్ట్ర మంత్రి వరకు సాగిన ఆమె ప్రయాణం ఆదర్శనీయం. ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన సీతక్క 33,700 మెజార్టీతో గెలిచారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండే ఆమెను అక్కడి ప్రజలు మరోసారి పట్టం కాట్టారు.

ములుగులో ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని కేసీఆర్‌​తో సహా ముఖ్యనేతలు భావించి సీతక్కకు పోటీగా నక్సలైట్ నేపథ్యం ఉన్న ఆదివాసి కుటుంబం నుంచి వచ్చిన బడే నాగజ్యోతిని బరిలోకి దింపారు. అయినప్పటికీ అక్కడ ప్రజలు మళ్లీ సీతక్కకే పట్టం కట్టారు. ప్రజల్లో సీతక్కకు ఉన్న ప్రజాదరణ, ఏళ్ల తరబడి ప్రజాసేవ చేస్తూ ప్రజా నాయకురాలు అనిపించుకుంటున్న ఆమెకు కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి పదవి ఇచ్చి గౌరవించుకుంది. ఇలా అడవుల ​ నుంచి అమాత్య పదవి అలంకరించి అసెంబ్లీకి చేరిన సీతక్క ప్రస్థానం అభినందనీయం.

Seethakka life story: from format naxalites to telangana state minister

సీతక్క తన రాజకీయ అరంగేట్రాన్ని తెలుగుదేశం పార్టీ ద్వారా చేశారు. ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్క.. రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా అడవుల్లో ఉంటూ ప్రజల కోసం నక్సలైట్‌గా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా కీలక భూమిక పోషించారు సీతక్క. ఆ తర్వాత నక్సలైట్లు జన జీవన స్రవంతిలో కలవాలని దివంగత మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు పిలుపునివ్వడంతో వారంతా పోరుబాట వదిలి లొంగిపోయారు.

వివిధ హోదాల్లో పని చేసిన సీతక్క.. కామ్రేడ్‌గా దాదాపు రెండు దశాబ్దాల పాటు గడిపారు. ఈ సమయంలోనే సీతక్క దళకమాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు. ఆ సమయంలో తనకు తానుగా సీతక్క పోలీసులకు లొంగిపోయారు. ఇక, సీతక్క తన అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

2001లో హైదరాబాద్‌​లో న్యాయవాది కావాలనుకున్న సీతక్క ఎల్ఎల్​బీ చదివారు. ఈ సమయంలోనే ప్రజా విధానం, పాలనపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రజలకు సేవా చేయాలని భావించి పలు కార్యక్రమాలు చేపట్టారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సీతక్కకు 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున ములుగు నియోజకవర్గం టికెట్‌ను ఇచ్చారు. 2004లో తొలిసారి టీడీపీ నుంచి పోటీ చేసిన సీతక్క.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.

Seethakka life story: from format naxalites to telangana state minister

అయినప్పటికీ వెనుదిరగకుండా 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి.. మళ్లీ అదే కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు సీతక్క. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె.. ములుగు స్థానం నుంచి సమీప అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం సీతక్క తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు.

ఇక, 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌తో మళ్లీ ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు సీతక్క. సీతక్క 2022 డిసెంబర్ 10న తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా నియామకం అయ్యారు. ఇక, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 33,700 భారీ మెజార్టీతో విజయాన్ని నమోదు చేశారు. రేవంత్ రెడ్డి వర్గం నాయకురాలిగి ముద్ర ఉన్న సీతక్కను ఆదివాసి మహిళగా గుర్తించి మంత్రి పదవి కట్టట్టింది కాంగ్రెస్ అధిష్టానం. కాగా, మంత్రిగా సీతక్క ప్రమాణం చేస్తున్న సమయంలో ఎల్బీ స్టేడియం మొత్తం ఆమె పేరుతో మారుమోగడం గమనార్హం. ప్రజలకు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఆమెకు మంత్రి పదవి లభించిందంటూ ములుగు నియోజకవర్గ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+