వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీతక్క సాహసం .. గోదావరి ముంపు ఏజెన్సీ గ్రామాల్లో.. రాత్రనక, పగలనక ... వర్షంలో తడుస్తూ జనం కోసం

|
Google Oneindia TeluguNews

కరోనా కష్టకాలంలో మారుమూల ఏజెన్సీ గ్రామాలలో పర్యటించి, ప్రజలకు నిత్యావసరాలు అందించి సహాయం చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలు ,వరదలతో అతలాకుతలమౌతున్న ఏజెన్సీ ప్రాంతాలలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వానను సైతం లెక్కచేయక వరదనీటిలో సీతక్క ములుగు జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలలో ముంపు గ్రామాలలో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Recommended Video

Seethakka Always For Weaker Sections || అడవుల్లో కాలినడకన నిత్యవసర సరుకులు అందజేస్తున్న సీతక్క

ముంపులోనే ఓరుగల్లు ... చరిత్రలోనే మొదటిసారి .. వేలాది ప్రజల కన్నీటి వరదముంపులోనే ఓరుగల్లు ... చరిత్రలోనే మొదటిసారి .. వేలాది ప్రజల కన్నీటి వరద

 ములుగు, ఏటూరునాగారం గోదావరి వరదముంపు ప్రాంతాలలో సీతక్క పర్యటన

ములుగు, ఏటూరునాగారం గోదావరి వరదముంపు ప్రాంతాలలో సీతక్క పర్యటన

24 గంటలు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా ప్రతినిధి అన్న పదానికి నిజమైన అర్థం చెప్తున్నారు ఎమ్మెల్యే సీతక్క. గోదావరి నదిలో వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని దిగువకు వదిలారు. దీంతో ములుగు, ఏటూరునాగారం ప్రాంతాలలో గోదావరి వరద ముంపుకు గురవుతున్న గ్రామాలను సందర్శిస్తున్న సీతక్క అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వారికి కావలసిన నిత్యావసరాలను అందించడంతోపాటుగా, బాగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గ్రామాలలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

కాలినడకన , జోరువానలో .. రాత్రనక , పగలనకా .. సీతక్క సాహసం

కాలినడకన , జోరువానలో .. రాత్రనక , పగలనకా .. సీతక్క సాహసం

వాహనాలు సైతం వెళ్లలేని ప్రాంతాలలో,ద్విచక్రవాహనాలపై, కాలినడకన సీతక్క పర్యటిస్తున్నారు.

విపరీతంగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఒకపక్క రైతులకు కలిగిన పంటనష్టాన్ని అంచనా వేస్తూనే, మరోపక్క ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తన వంతు కృషి చేస్తున్నారు.రాత్రి సమయాల్లో జోరున వానలో కూడా ఆమె గిరిజనం కోసం పనిచేస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .

 నేను సీతక్కను ... మీకోసం వచ్చాను ... అంటూ ప్రజాక్షేత్రంలో

నేను సీతక్కను ... మీకోసం వచ్చాను ... అంటూ ప్రజాక్షేత్రంలో

నేను సీతక్క ను... మీకోసం వచ్చాను.. గోదావరికి వరద పోటెత్తుతోంది.. నీటిని కిందికి వదిలారు.. వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది.. పునరావాస కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశాము, మీరు అక్కడ సురక్షితంగా ఉంటారు.. కదలండి అంటూ ప్రతి ఏజెన్సీ గ్రామంలోనూ మైకు పట్టుకుని ఇంటింటికి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అర్ధ రాత్రి సమయాల్లో జోరువాన సైతం లెక్కచేయకుండా తమ కోసం వస్తున్న ఎమ్మెల్యే సీతక్క ను చూసి ఏజెన్సీ గ్రామాల ప్రజలు కష్టకాలంలో తమకు భరోసా అని ఫీల్ అవుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో తాజా పరిస్థితిపై సీతక్క ఆందోళన .. ప్రభుత్వం సహాయం చెయ్యాలని విజ్ఞప్తి

ఏజెన్సీ ప్రాంతాల్లో తాజా పరిస్థితిపై సీతక్క ఆందోళన .. ప్రభుత్వం సహాయం చెయ్యాలని విజ్ఞప్తి


ఏజెన్సీ గ్రామాల్లోని తాజా పరిస్థితిపై సీతక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు వెళితే పూర్తిగా మునిగిపోయి, ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని , అక్కడ ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో , ఎందరు అనారోగ్యంతో బాధ పడుతున్నారో అర్థంకాని పరిస్థితి ఉందని ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని ముంపు గ్రామాల ప్రజలకు సహాయం చేయాలని ఎమ్మెల్యే సీతక్క కోరుతున్నారు.

తెలంగాణా ప్రభుత్వం వద్ద పెండింగ్ ఫైల్స్ .. సీఎం దృష్టి పెట్టాలని కోరిన సీతక్క

తెలంగాణా ప్రభుత్వం వద్ద పెండింగ్ ఫైల్స్ .. సీఎం దృష్టి పెట్టాలని కోరిన సీతక్క

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సీతక్క విజ్ఞప్తి చేస్తున్నారు.ములుగు నియోజకవర్గ సమస్యల ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని అంటున్నారు. వరద ముంపుకు గురి కాకుండా కరకట్ట నిర్మాణానికి సంబంధించి ఫైల్ తెలంగాణ ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందని, సీఎం కేసీఆర్ ఇప్పటికైనా దానిపై దృష్టి సారించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.

 సీతక్క సాహసానికి హ్యాట్సాఫ్ అంటున్న ప్రజలు.. ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణా అని కితాబు

సీతక్క సాహసానికి హ్యాట్సాఫ్ అంటున్న ప్రజలు.. ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణా అని కితాబు

కష్టాల్లో ఉన్న ప్రజల కోసం నేనున్నాను మీకోసం అంటూ ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న సాహసానికి "ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ" అంటూ సీతక్కను ప్రజలు కొనియాడుతున్నారు. సీతక్కను చూసి చాలా మంది ప్రజా ప్రతినిధులు బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నారు.అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ఎమ్మెల్యే అన్న పదానికి నిజమైన అర్థం చెబుతున్నారని అంటున్నారు. హ్యాట్సాఫ్ ఎమ్మెల్యే సీతక్క అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

English summary
Mulugu MLA Seethakka taking part in relief operations in agency villages affected by heavy rains and godavari floods . Sitakka is visiting the flood-hit villages of the Godavari basin in Mulugu district in the floodwaters, regardless of whether it is raining day or night. People there are being shifted to rehabilitation centers. Everyone is praising her services in the storm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X