" వెయ్యేండ్లు నిలిచేలా మేడారాన్ని అభివృద్ధి చేస్తాం "

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. మేడారం అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఆ పనులు వేగంగా సాగి, రాబోయే మేడారం మహా జాతరకు ముందు పూర్తి అయ్యే విధంగా చూడాలని తల్లులను ప్రార్థించారు.

జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు విచ్చేసే ఈ ప్రాంతంలో సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తల్లుల దీవెనలతో మేడారం అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకు ముక్కులు చెల్లించుకున్న అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు.

"మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. గద్దెల ప్రాంగణాన్ని విస్తరించి, అద్భుతంగా ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు ఎంత మెరుగైన దర్శనాన్ని, సదుపాయాలను కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. వారం క్రితమే మేడారం అభివృద్ధి పనులు మొదలయ్యాయి. జాతర రాకముందే పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు" అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

"సమ్మక్క- సారలమ్మ దేవతల మీద రోజురోజుకూ భక్తుల విశ్వాసం పెరుగుతోంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. మేడారం మహా జాతర ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. మేడారం పనులు శరవేగంగా సాగుతున్నాయి. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాం. గుడి అభివృద్ధిలో నాకు భాగస్వామ్యం దక్కడం నా అదృష్టం. సీఎంతోపాటు, జిల్లా ఇంచార్జ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ, ట్రైబల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కు ధన్యవాదాలు. ప్రతి దశలో పూజారులను సంప్రదిస్తూ పనులు కొనసాగిస్తున్నాం" అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Seethakka s Sacred Vow Medaram Temple Set for 1 000-Year Legacy Boost

"గుడి నిర్మాణంలో ఆదివాసుల చరిత్ర, సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజుల కుటుంబాల చరిత్ర, వారి త్యాగాలు, పూజారుల వంశ చరిత్ర ను భవిష్యత్తు తరాలకు అందించేలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఈ జన్మకు ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఎవరెన్ని విమర్శలు చేసినా వెయ్యేండ్లు నిలిచేలా మేడారాన్ని అభివృద్ధి చేస్తాం. నాకు జన్మనిచ్చింది సమ్మక్క సమ్మయ్య. కానీ నాకు పునర్జన్మ ఇచ్చింది సమ్మక, సారలమ్మ, పగిడిద్ద గోవిందరాజులు. నన్న ఈ స్థాయికి తీసుకొచ్చింది. సమ్మక సారలమ్మ, ములుగు ప్రాంత ప్రజలు. కాబట్టి తల్లుల సేవలో ప్రజాసేవలో ఎల్లప్పుడు ఉంటాం. తల్లుల గొప్ప కీర్తిని కొంచెం కూడా తగ్గకుండా ముందుకు తీసుకెళ్తాం. ఈ చిన్న సమస్య లేకుండా గుడి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం" అని మంత్రి సీతక్క తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+