తెరాస నేతలకు హెచ్చరికలపై పోలీస్ ఆరా, గుడికి రూ.లక్ష ఇచ్చిన నయీం

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ బూటకమని, తెరాస నేతలను హెచ్చరిస్తూ క్రాంతి సేన పేరుతో మీడియాకు ఓ ప్రకటన విడుదలైంది. దీని పైన పోలీసులు దృష్టి సారించారు. ఆ ప్రకటన నకిలీదిగా భావిస్తున్నప్పటికీ లోతుగా ఆరా తీస్తున్నారు.

కావాలనే దీనిని ఎవరో విడుదల చేశారా అనే కోణంలో చూస్తున్నారు. అవసరమైతే మావోయిస్టులతో చేతులు కలిపి కొందరు తెరాస ఎమ్మెల్యేలను వదలబోమని హెచ్చరించడంతో అప్రమత్తమయ్యారు. అందులో ప్రకటించిన పేర్లతో పాటు మరికొందరు అధికార పార్టీ నేతలకు భద్రత పెంచారు.

నయీం గ్యాంగులోని వారే ఈ ప్రకటన విడుదల చేసి ఉంటారని భావిస్తున్నారు. నయీం హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, తెరాస నేతలను టార్గెట్ చేస్తామని క్రాంతి సేన పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. నయీం ఫేక్ ఎన్‌కౌంటర్లో మృతి చెందాడని అందులో పేర్కొన్నారు.

Self-styled outfit vows to avenge Nayeem's killing

నయీం కేసులో పోలీసులపై తొలివేటు

నయీం కేసులో పోలీసులపై తొలి వేటు పడింది. నయీం బాధితులను వేధించారనే ఆరోపణలతో ఇద్దరు పోలీసు అధికారులపై సిట్‌ ఐజీ నాగిరెడ్డి సస్పెన్షన్‌ వేటు వేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సీఐ ఉపేంద్ర, చంగోమల్‌ ఎస్సై శేఖర్‌ను సస్పెండ్‌ చేశారు.

నయీం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు ఇప్పటి వరకు నలభై మంది నయీం అనుచరులపై కేసులు నమోదు చేశారు. అన్ని జిల్లాల్లో నయీం బాధితులు ఎవరు ఫిర్యాదు చేసినా తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు సిట్‌ ఐజీ నాగిరెడ్డి సూచించారు. ఈ మేరకు సిట్‌ కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ తెరిచారు. కాల్ సెంటర్‌కు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

కాగా, ఖమ్మం జిల్లాలోను నయీంకు డెన్ ఉంది. అతను జిల్లాలోని చింతకాని మండల పరిధిలోని గాంధీ నగర్లో తల్లి పేరిట గెస్ట్ హౌస్ కొనుక్కున్నాడు. గాంధీ నగర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి నయీం తన తండ్రి, తల్లి పేరిట రూ.1,10,116 విరాళంగా ఇచ్చాడు.

ఎంతోమందిని చంపిన నయీం

నయీం దుశ్చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నయీం గ్యాంగు చేతిలో దాదాపు 20 మంది హతమైనట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. అందరినీ విచక్షణా రహితంగా చంపేశారు. మృతదేహాల్ని కారులో నిర్మానుష్య ప్రాంతాలకు తరలించి నిప్పంటించే వాడని కస్టడీలోని నిందితులు వెల్లడించారు.

వివిధ జిల్లాల్లో నయీం అనుచరులు రెచ్చిపోయి భూకబ్జాలకు, డబ్బు వసూళ్లకు పాల్పడే వాడని తెలుస్తోంది. నయీం పెట్టుబడి.. జనాల భయమే. తమను బెదిరించి తమ ఆస్తులు లాక్కున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+