వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నర్సుల సేవలకు సలామ్.!ప్రాణాలను పణంగా పెడుతున్న కర్యవ్యానికి జోహార్లంటున్న ఎమ్మెల్సీ కవిత, షర్మిళ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అంతర్జాతీయ 'నర్స్' దినోత్సవం సందర్బంగా దేశంలో ముఖ్యంగా రాష్ఠ్రంలో సేవలందిస్తున్న నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైయస్సార్ సీపి నాయకురాలు వైయస్ షర్మిల. అనుక్షణం రోగులకు సాంత్వన చేకూరుస్తూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించే నర్సుల సేవలకు వెలకట్టలేమని, ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఒకవైపు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే, కరోనా రోగుల రికవరీలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సులందరికీ శిరస్సు వంచి సమస్కరిస్తున్నట్టు కవిత తెలిపారు.

నర్పుల సేవలు వెలకట్టలేనివి.. ట్విట్టర్ ద్వారా కొనియాడిన ఎమ్మెల్సీ కవిత, షర్మిళ..

నర్పుల సేవలు వెలకట్టలేనివి.. ట్విట్టర్ ద్వారా కొనియాడిన ఎమ్మెల్సీ కవిత, షర్మిళ..

ఇక వైయస్సార్ సీపి నాయకురాలు వైయస్ షర్మిళ కూడా నర్సుల పట్ల అనూహ్యంగా స్పందించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, తమ బంధాలను దూరం పెట్టి,
తమ బాధ్యతలను, విధులను నిర్వహిస్తున్నామని కాకుండా, కరోనా ను ఎదుర్కోవడంలో అవిశ్రాంతంగా, ముందుండి పోరాడుతున్న ప్రతి నర్స్ కి నర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు షర్మిళ. కరోనా పోరాటంలో నర్సులు చూపే ధైర్యానికి సెల్యూట్ తెలియజేసారు వైయస్ షర్మిళ.

నర్సుల సేవలకు రుణపడి ఉన్నాం.. ఏమిచ్చినా రుణం తీరదంటున్న మహిళా నేతలు..

నర్సుల సేవలకు రుణపడి ఉన్నాం.. ఏమిచ్చినా రుణం తీరదంటున్న మహిళా నేతలు..

కోవిడ్ మహమ్మారి రెండవ దశ విజృంభిస్తున్న విపత్కర సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలను వదిలి పెట్టి, నిత్యం రోగులకు చేస్తున్న నర్సుల సేవలు అనుపమానమైనవని కవిత, షర్మిళ కొనియాడారు. నర్సులు చేసే సేవలకు అందరం ఎంతో రుణపడి ఉన్నామని, వారి సేవలు వెలకట్టలేనివని, ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకోవడం, వారి సేవలను గుర్తించడమే మనం వారికి ఇచ్చే గౌరవం అన్నారు. వారికున్న సేవాభావం, కరుణ, శ్రద్దలే ఈ సమాజాన్ని అనారోగ్యం నుంచి కాపాడుతూ శ్రీరామరక్షగా నిలుస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు కవిత, షర్మిల.

త్యాగమూర్తులు నేటి నర్సులు.. కోవిడ్ విజృంబిస్తున్న వేళ వారి సేవలు చాలా గొప్పవన్న కవిత, షర్మిల..

త్యాగమూర్తులు నేటి నర్సులు.. కోవిడ్ విజృంబిస్తున్న వేళ వారి సేవలు చాలా గొప్పవన్న కవిత, షర్మిల..

కరోనా రెండవ దవతో కుదేలవుతున్న విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు నిరంతరం సేవలందిస్తూ 56 మంది నర్సులు కోవిడ్ బారిన పడి కోలుకుని మళ్ళీ తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు తమ విలువైన సేవలను అందిస్తున్న నర్సులను వారు అభినందించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారి నిస్వార్థ సేవలను స్మరించుకున్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని త్యాగపూరిత సేవలందిస్తున్న నర్సులందరికి, ప్రత్యేక కోవిడ్ కరాళనృత్యం చేస్తున్న తరుణంలో వారి సేవలు వెలకట్టలేవని తెలిపారు.

నర్సుల సేవలు అమూల్యమైనవని.. వారికి శిరస్సు వంచి పాదాభవందనం అంటున్న నాయకురాళ్లు..

నర్సుల సేవలు అమూల్యమైనవని.. వారికి శిరస్సు వంచి పాదాభవందనం అంటున్న నాయకురాళ్లు..

అంతే కాకుండా ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు మే - 12 నాడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ప్రస్తుత కోవిడ్ విపత్కర సమయంలో నర్సుల త్యాగం, అంకిత భావం గుర్తు చేసుకోవడం సమంజసమని కవిత, షర్మిళ ఉద్ఘాటించారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కోవిద్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్న నర్సుల సేవలు అమూల్యమైనవని అభిప్రాయపడ్డారు. వారు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. ఈ సందర్బంగా వారు ట్వీట్ల ద్వారా నర్సుల సేవలను అభినందిస్తూనే నర్సులకు పాదాభివందనం తెలిపారు ఎమ్మెల్సీ కవిత, వైయస్ షర్మిళ.

English summary
On the occasion of International 'Nurse's Day', mlc Kalvakuntla Kavitha and YSR CP leader Ys Sharmila congratulated the nurses serving in the country, especially in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X