భట్టి పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు - కన్నీటి పర్యంతం..!!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హనుమంతరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందోని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. వీహెచ్ త్వరలో జరిగే ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో తనకు సీటు రాకుండా భట్టి అడ్డు పడుతున్నారంటూ వీహెచ్ కన్నీరు పెట్టుకున్నారు.

హనుమంతరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. పార్టీలో పరిస్థితిని వివరిస్తూనే.. ఖమ్మం ఎంపీగా తనకు ఈసారైనా ఛాన్స్‌ ఇస్తే గెలుస్తానన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయకుండా తన పేరు లిస్ట్‌లో లేకుండా చేస్తున్నారని భట్టి పై ఆరోపణలు చేసారు. రాహుల్ గాంధీ న్యాయ్‌ యాత్ర, కుల గణన అంటున్నారని..ముందుగా తనకు న్యాయం చేయాలని కోరారు. ఖమ్మం నుంచి రాహుల్ పోటీ చేస్తే తాను తప్పుకుంటానన్నారు. తాను పూర్తిగా ఎంపీగా పోటీకి అర్హుడినేనని చెప్పుకొచ్చారు.

Senior leader V Hanumanth Rao made sensational Allegations against DY CM Bhatti

తాను పార్టీ మారే వ్యక్తిని కాదన్న వీహెచ్..తాను పార్టీలో ఎందరికో సాయం చేసానన్నారు. తన పోటీకి వయసు అడ్డంకి కాదన్నారు. తాను లోకల్ కాదంటున్న నేతలు..గతంలో ఖమ్మం నుంచి గెలిచిన రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్‌, రంగయ్య నాయుడు లోకలా అని ప్రశ్నించారు. ఖమ్మం సీటు తనకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. బీసీల ఓట్లు కాంగ్రెస్ కు అవసరం లేదా అని వ్యాఖ్యానించారు. భట్టిని ఎమ్మెల్సీని చేసింది తానేనని గుర్తు చేసారు. తన వయసు మించిపోలేదని తనలాగా చురుగ్గా పార్టీలో పనిచేసే నేత ఎవరూ లేరని వీహెచ్ కన్నీరు పెట్టారు. ఇప్పుడు వీహెచ్ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+