వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీనియర్ నేత బంపర్ ఆఫర్: నో చెప్పిన రేవంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇటీవల ఓ బంపర్‌ ఆఫర్‌ తగిలిందంటూ గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న ఒక సీనియర్‌ నేత ఒక మధ్యవర్తిని ఆయన వద్దకు పంపినట్లు తెలుస్తోంది.

ఇద్దరం కలిసి పార్టీ పెడుదామని ఈ సీనియర్ నేత రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. పార్టీ పెడితే వచ్చే లాభాలను ఆ సీనియర్‌ నేత తరపున మధ్యవర్తి రేవంతకు వివరించారని ఆ మీడియా వార్తాకథనం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఇప్పుడు ఉన్న పార్టీలు పోరాటానికి సరిపోవడంలేదని, దానికి తోడు ఎవరు ఆ ఆయనతో లోపాయికారి అవగాహనతో ఉన్నారో కూడా తెలియడం లేదని ఆ సీనియర్ నేత అన్నట్లు తెలుసత్ోంది.

 Senior political leader gives bumper offer to revanth Reddy

కొత్త పార్టీలోకి కెసిఆర్ వ్యతిరేకులందరినీ సమీకరిస్తే అది ప్రజలను ఆకర్షించగలుగుతుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. కాని ఈ ప్రతిపాదనను రేవంత తిరస్కరించినట్లు తెలుస్తోంది.

కొత్తగా పార్టీలు పెడితే అవి నిలదొక్కుకొనే పరిస్ధితి లేదని, పెద్దపెద్దవాళ్లు పెట్టిన పార్టీలకే దిక్కు లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉండి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబే ఇక్కడ పార్టీని నిలబెట్టడానికి ఎంతో శ్రమించాల్సి వస్తోందని, ఇక మిగతా వాళ్లు పార్టీ పెడితే ఫలితం సాధిస్తామనే నమ్మకం లేదని ఆయన అన్నట్లు చెబుతున్నారు.

తాను టీడీపీలో హాయిగానే ఉన్నాను, ఇక్కడే ఉంటానని రేవంత్ రెడ్డి ఆ మధ్యవర్తికి స్పష్టంగా చెప్పారు. టిడిపిని నిలబెట్టగలననే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

English summary
According to media reports - A senior leader from Telangana has given bumper offer to Telugu Desam Party (TDP) working president Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X