శిరీష కేసులో విస్తుపోయే నిజాలు: రాజీవ్‌కు నాలుగు నెలలకొక గర్ల్ ఫ్రెండ్!, హత్యేనంటున్న సోదరి

Subscribe to Oneindia Telugu

నల్లగొండ: బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో లింకు బయటపడటం.. ఫోటో స్టూడియో యజమాని రాజీవ్ తో శిరీషకు వివాహేతర సంబంధం ఉందా? అన్న అనుమానాలు తెరపైకి రావడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ట్విస్ట్ ల మీద ట్విస్ట్: కారులో శిరీష, రాజీవ్ మధ్య ఏమైంది, ప్రభాకర్ రెడ్డికి 20 మెమోలు?

అంతకుమించి శిరీష ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల అదుపులో ఉన్న రాజీవ్, శ్రవణ్ లు చెబుతున్నట్లు శిరీష నిజంగా ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యకు గురైందా? అన్న సందేహాలు కూడా తలెత్తాయి. శిరీష పెదవులు, మెడపై ఉన్న గాయాలు దీనికి ఊతమిచ్చాయి.

ఫోరెన్సిక్ తేల్చింది.. శిరీషది ఆత్మహత్యే!?: కాసేపట్లో పోలీసుల ప్రెస్ మీట్!

ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ రిపోర్టు శిరీషది ఆత్మహత్యే అని తేల్చిందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో శిరీష బంధువులు దీన్ని ఖండిస్తున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెబుతున్నారు.

శిరీష సోదరి భార్గవి ఏమందంటే!:

శిరీష సోదరి భార్గవి ఏమందంటే!:

తమ చెల్లి శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె సోదరి భార్గవి చెబుతున్నారు. ఆత్మహత్యకు తావు లేదని శిరీషది ముమ్మాటికే హత్యేనని ఆమె ఆరోపిస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఎవరిని వదిలిపెట్టవద్దని డిమాండ్ చేశారు. శిరీష హత్య వెనుక రాజీవ్, శ్రవణ్, తేజస్విల హస్తం ఉందని, వారే శిరీషను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

శిరీష ధైర్యవంతురాలు..అలా చేయదు:

శిరీష ధైర్యవంతురాలు..అలా చేయదు:

తన సోదరి శిరీష చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని భార్గవి పేర్కొన్నారు. ఇంట్లోను ఎలాంటి ఇబ్బందులు లేవని, ఈ కేసును విచారిస్తున్న పోలీసులపై అనుమానాలున్నాయని అన్నారు. ఇప్పటివరకు తేజస్విని పోలీసులు ఎందుకు చూపించడం లేదని శిరీష ప్రశ్నించారు. అంతకుముందు శిరీష భర్త సతీష్ చంద్ర సైతం ఆమెది హత్యేనని ఆరోపించడం గమనార్హం.

మధ్యాహ్నాం ప్రెస్ మీట్:

మధ్యాహ్నాం ప్రెస్ మీట్:

శిరీష కుటుంబ సభ్యుల ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ.. ఆమెది మాత్రం ఆత్మహత్యేనని విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోరెన్సిక్ రిపోర్టులో ఆధారాలు లభించగా.. మధ్యాహ్నాం 2గం.కు హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి స్వయంగా వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

రాజీవ్ శ్రవణ్ అరెస్టు, విస్తుపోయే విషయాలు:

రాజీవ్ శ్రవణ్ అరెస్టు, విస్తుపోయే విషయాలు:

బ్యుటీషియన్ శిరీష మృతి కేసులో రాజీవ్, శ్రవణ్ లను గురువారం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శుక్రవారం వారిద్దరిని అరెస్టు చేశారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసినట్లు సమాచారం. . రాజీవ్‌కు అమ్మాయిలంటే బాగా మోజు అని, ఎంతోమంది యువతులకు అతడు వల వేశాడని విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

అతని వలలో చిక్కుకుని ఎంతోమంది బలికాగా.. కొంతమంది పరువు పోతుందన్న ఉద్దేశంతో బయటపడలేదని పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. రాజీవ్ గురించి అతని స్టూడియో పరిసరాల్లో ఆరా తీయగా.. నాలుగు నెలలకొక సారి అతను గర్ల్ ఫ్రెండ్ ను మారుస్తుంటారని అక్కడివాళ్లు పేర్కొనడం గమనార్హం.

నాలుగేళ్ల క్రితం పరిచయం:

నాలుగేళ్ల క్రితం పరిచయం:

బ్యుటీషియన్ గా పనిచేసే శిరీషకు ఓ పెళ్లిలో రాజీవ్ తో పరిచయం ఏర్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్టూడియో చూసుకునేందుకు ఒక లేడీ కావాలని చెప్పడంతో శిరీష అక్కడ పనిచేసేందుకు అంగీకరించింది. కొద్ది రోజులు అంతా బాగానే ఉన్నప్పటికీ.. క్రమక్రమంగా ఆమెకు పనిభారం పెంచడం మొదలుపెట్టాడు రాజీవ్. అలా ఆమెను ఇంటి కన్నా ఎక్కువగా స్టూడియోలోనే ఉండేలా చేసి.. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లుగా ఆరోపణలున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police find out that Rajiv, who accused in Sirisha's suspicious death was like a play boy. He change his girl friends for every four months
Please Wait while comments are loading...