రఘురామకు తెలంగాణ హైకోర్టు షాక్-కానిస్టేబుల్ ఫిర్యాదుపై క్వాష్ పిటిషన్ కొట్టివేత

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో నిత్యం మాటలయుద్ధం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇవాళ తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తాజాగా హైదరాబాద్ లోని ఆయన ఇంట్లోకి నిఘా కోసం వెళ్లిన ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను బంధించి కొట్టిన వ్యవహారంపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ రఘురామ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.

ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను బంధించి కొట్టిన వ్యవహారంలో తనతో పాటు తనకుమారుడిపై గచ్చిబౌలి పిఎస్ లో దాఖలైన కేసు కొట్టివేయాలని రఘురామరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు చేపట్టిన దర్యాప్తును అడ్డుకోవాలని అభ్యర్ధించారు. దీనికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

setback to raghurama raju as ts high court dismiss quash petition on constable complaint

ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను ఇంట్లో నిర్భందించి దాడిచేశారని పోలీసులు న్యాయస్ధానం దృష్టికి తెచ్చారు. దీనికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అలాగే కేసు దర్యాప్తు కీలక దశలో ఉందనిలో ఉందని కోర్టుకు వెల్లడించారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది సైతం సస్పెండ్ అయ్యారని పోలీసులు తెలిపారు. పోలీసుల వాదనతో ఏకభవించిన హైకోర్టు రఘురామ పిటిషన్ కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ప్రధాని మోడీ భీమవరం టూర్ సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రఘురామరాజు విఫలమయ్యారు. అదే సమయంలో రఘురామ ఇంట్లోనే ఉన్న సమయంలో ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ నిఘా కోసం ఆయన ఇంట్లో దూరాడు. దీన్ని గమనించిన రఘురామరాజు సెక్యూరిటీ సీఆర్బీఎఫ్ సిబ్బంది అతన్ని పట్టుకుని దాడి చేసినట్లు తెలిసింది.దీనిపై సదరు కానిస్టేబుల్ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు స్పందించి కేసు నమోదు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+