ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి: ఆత్మహత్యా, హత్యా?

Recommended Video

    ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి, వీడియో !

    యాదాద్రి: తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు ఆత్మహత్య చేసుకున్నారా, ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    నిజానికి, ఫుడ్ పాయిజన్ వల్ల వారు మరణించి ఉంటారని తొలుత అనుకున్నారు. కానీ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు.

    కోళ్లఫారం వద్ద నివాసగృహంలో వారు మరణించారు. మృతిచెందినవారు వృద్ధులు బైండ్ల బాలనర్సయ్య, భారతమ్మ, దంపతులు బాలరాజు, తిరుమల సహా ఇద్దరు కుమారులు, కూతురు.

     కోళ్లఫారం వద్ద నివాసంలో ఇలా..

    కోళ్లఫారం వద్ద నివాసంలో ఇలా..

    కోళ్లఫారం వద్ద నివాసగృహంలో వారు శవాలై కనిపించారు. మృతిచెందిన వారిని బచ్చలి బాలనర్సయ్య(65), భారతమ్మ(58), దంపతులు బాలరాజు(44), నిర్మల(39) సహా ఇద్దరు కుమారులు చింటూ(12), బన్ని(8), కుమార్తె శ్రావణి(14లుగా గుర్తించారు).

    నెల రోజుల క్రితమే వచ్చారు..

    నెల రోజుల క్రితమే వచ్చారు..

    కుటుంబ సభ్యులంతా నెలరోజుల క్రిమే కోళ్లఫారంలో పనికి కుదిరారు. వృద్ధ దంపతుల స్వస్థలం జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తరిగొప్పుల గ్రామం. కూతురిని, అల్లుడిని చూసి వెళ్లేందుకు వచ్చారు. మిగతావారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడపకు చెందినవారు.

     ఫుడ్ పాయిజన్ కావచ్చునని..

    ఫుడ్ పాయిజన్ కావచ్చునని..

    రాత్రి తిన్న చికెన్ ఫుడ్ పాయిజన్ కావడం వల్ల వారు మరణించి ఉండవచ్చని స్థానికులు తొలుత అభిప్రాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వారిది ఆత్మహత్యగా అనిపించడం లేదంటూ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

    సంఘటనాస్థలాన్ని పరిశీలించిన భువనగిరి డీసీపీ

    సంఘటనాస్థలాన్ని పరిశీలించిన భువనగిరి డీసీపీ

    భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి సంఘటనాస్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుల మతి అనుమానాస్పదంగానే భావిస్తున్నామని డీసీపీ స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+